కోల్‌కతా: మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు షాక్ అయ్యారు. కోట్లాది నగదు, కిలోల బంగారం లభించాయి. ఈ నేపథ్యంలో నోట్ల లెక్కింపు మెషిన్‌తో ఆ డబ్బును లెక్కిస్తున్నారు. (bus driver) పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా మినార్ మోండల్ పని చేశాడు. కొన్నేళ్ల కిందట డ్రైవర్ ఉద్యోగాన్ని వీడాడు. బంధువైన స్థానిక వ్యాపారి టులు మోండల్ రాళ్ల వ్యాపారంలో సహాయం చేశాడు. ఆ తర్వాత సొంతంగా రాళ్ల వ్యాపారం చేస్తున్నాడు.
కాగా, మినార్ మోండల్ అక్రమ సంపాదన, ఆస్తులపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం అతడి ఇంట్లో సోదాలు చేశారు. రూ.5 కోట్లకు పైగా డబ్బు, 15 కిలోల బంగారాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో పెద్ద ట్రంకు పెట్టెలు, నోట్ల లెక్కింపు యంత్రాలను తెప్పించి ఆ డబ్బును లెక్కిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్వాధీనం చేసుకున్న ఖచ్చితమైన మొత్తం ఎంత అన్నది తెలుస్తుందని చెప్పారు.
మరోవైపు ఈ డబ్బు, బంగారం మినార్‌కు చెందినదా? లేక బంధువైన టులూ మోండల్దా? అన్నది పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల నేపథ్యంలో మాజీ ప్రభుత్వ డ్రైవర్ అయిన మినార్ నివాసం బయట భారీగా పోలీసులను మోహరించారు.
#Breaking: Police have recovered a massive cache of cash & gold from the residence of a relative of stone quarry businessman Tulu Mondal in Birbhum’s Mohammad Bazar.
So far, around Rs. 5 crore in cash & nearly 15 kg of gold (estimated to be worth Rs. 22 crore) have been seized.… pic.twitter.com/qFU1f24Ah6
— Pooja Mehta (@pooja_news) July 29, 2026