Lal Darwaza Bonalu | పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల వేడుకలు.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహుదుర్‌పురా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
Lal Darwaza Bonalu | సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహుదుర్‌పురా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూల్ వరకు కొనసాగే భారీ ర్యాలీలో ఏనుగుపై ఉరేగింపు ఉంటుందన్నారు. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను పార్కు చేయాలని సూచించారు.
సింహ వాహిని మహంకాళి లాల్‌దర్వాజ బోనాలను పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వంద ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాల్ దర్వాజ ఆలయం, ఎంజీబీఎస్, రేతిఫైల్, జేబీఎస్ల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమాచారం కోసం 9959226154, 9959 226160 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

