కలివిడిగా నిద్ర
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నట్టే.. మానవ సంబంధాల్లోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. మిగతా బంధాల సంగతేంటో కానీ, ఆలుమగల అనుబంధంలో వింతవింత పోకడలు పొడ చూపుతున్నాయి.
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నట్టే.. మానవ సంబంధాల్లోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. మిగతా బంధాల సంగతేంటో కానీ, ఆలుమగల అనుబంధంలో వింతవింత పోకడలు పొడ చూపుతున్నాయి. తాజాగా స్లీపింగ్ డైవర్స్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి యంగ్ జంటలు. నిద్రవేళలో విడాకులు అన్నమాట! వినేవాళ్లకు ఇది విడ్డూరమే కానీ, ఆయా జంటలు ‘ఇది మా మంచికే’ అని చెబుతున్నాయి.
పొద్దంతా కలివిడిగా ఉండే జంటలు సైతం.. రాత్రయ్యాక విడిగా ఒంటరి నిద్రకు ఉపక్రమిస్తున్నారట. పడగ్గదిలో ‘మాకు మేమే మీకు మీరే..’ అని పల్లవి ఎత్తుకుంటున్నారట. ఎందుకని ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న దంపతుల జీవితాలు కృతకంగా మారిపోతున్నాయి. టార్గెట్లు, మీటింగులతో బుర్ర హీటెక్కిన వాళ్లకు కాస్త ప్రశాంతత కుదిరేది నిద్రలోనే! ఆదమరచి నిద్రపోతున్న వేళ, అనుకోకుండా శ్రీవారి చేయి తగిలిందా.. ఆమె కస్సుమనడం ఖాయం. ఆయనగారు గురక పెడితే.. పాపం ఈవిడకు నిద్రాభంగం. తెల్లారితే మళ్లీ ఉరుకులు, పరుగులు.
ఈ సమస్యకు జోలపాడుతూ నయా తరం ఎంచుకున్న మార్గమే ‘స్లీపింగ్ డైవర్స్’. ప్రత్యేక సందర్భాల్లో.. ఆ ముచ్చట తీరేవరకు విడాకులకు విడాకులు ఇచ్చేసి, మళ్లీ ఎవరి గదిలోకి వాళ్లు తుర్రుమంటున్నారట. ఎంత బిజీగా ఉంటే మాత్రం.. ఇవేం పాడుబుద్ధులు అని పెద్దవాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. భౌతికంగా బలమైన బంధం లేకుంటే.. మానసికంగా దగ్గరయ్యే అవకాశాలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం, ఒత్తిళ్లకు ఉపశమనంగా..‘స్లీపింగ్ డైవర్స్’ ఎంచుకుంటున్నారు కానీ, గాఢంగా కౌగిలించుకుని పడుకున్నప్పుడు కలిగే అనుభూతి ముసుగుతన్ని, ముడుచుకొని పడుకున్నా రాదని కొందరి అభిప్రాయం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

