వెయిట్‌లిఫ్టర్ మమ్మీ
సోషల్ మీడియాలో రోష్నిదేవి ఇప్పుడో సంచలనం. ఈమె రోదసిలోకి వెళ్లలేదు. ఎవరెస్ట్ శిఖరమూ అధిరోహించలేదు. కానీ, ఆమె చేస్తున్న ఫీట్లు చూసి.. ఈ పెద్దమ్మ అంతకుమించి అని పొగుడుతున్నారు నెటిజన్లు. ఢిల్లీకి చెందిన రోష్నిదేవికి ఇప్పుడు 69 ఏండ్లు. చాలా ఏండ్లనుంచి ఆమె కీళ్లనొప్పులతో సతమతమవుతున్నది. రెండేండ్ల కిందట ఊపిరి సలపనంతగా నొప్పులు అధికమయ్యాయి.
సోషల్ మీడియాలో రోష్నిదేవి ఇప్పుడో సంచలనం. ఈమె రోదసిలోకి వెళ్లలేదు. ఎవరెస్ట్ శిఖరమూ అధిరోహించలేదు. కానీ, ఆమె చేస్తున్న ఫీట్లు చూసి.. ఈ పెద్దమ్మ అంతకుమించి అని పొగుడుతున్నారు నెటిజన్లు. ఢిల్లీకి చెందిన రోష్నిదేవికి ఇప్పుడు 69 ఏండ్లు. చాలా ఏండ్లనుంచి ఆమె కీళ్లనొప్పులతో సతమతమవుతున్నది. రెండేండ్ల కిందట ఊపిరి సలపనంతగా నొప్పులు అధికమయ్యాయి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదనిపించింది. రోష్ని కొడుకు అజయ్ సాంగ్వాన్ జిమ్ ట్రైనర్. కీళ్లనొప్పులకు తాళలేకపోతున్న తల్లిని ఒకసారి తనతోపాటు జిమ్‌కు రమ్మన్నాడు. రేపూమాపూ అంటూ దాటవేస్తూ నెలలు గడిపింది. కొడుకు బలవంతం మీద ఒకరోజు జిమ్ బాటపట్టింది. తల్లితో అజయ్ తొలుత తేలికపాటి వ్యాయామాలు చేయించాడు. ఆమె విసుక్కుంది. ఆ రాత్రి ఒళ్లంతా కంపరం పెట్టినట్టుందని కొడుకుపై చిర్రుబుర్రులాడింది. అతను మాత్రం వెనక్కి తగ్గలేదు. మర్నాడూ ఆమెను జిమ్‌కు తీసుకెళ్లి చిన్నచిన్న వర్కవుట్లు చేయించాడు.
నాలుగు రోజులు గడిచాయి.. తన శరీరానికి ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది రోష్నికి. వారం గడిచాక బరువులు ఎత్తే స్కాట్ వర్కవుట్లు చేయించడం మొదలుపెట్టాడు. డంబెల్స్ ఎత్తడానికి మొదట్లో జంకింది. కొడుకు మద్దతుతో ప్రయత్నించింది. తర్వాత రోజురోజుకూ ఎత్తే బరువును పెంచుతూ పోయింది. ఇప్పుడు ఆమె ఏకంగా అరవై కిలోలు అవలీలగా ఎత్తేయగలదు. నలభై కిలోల దాకా లెగ్ ప్రెస్ చేయగలదు. అకుంఠిత దీక్షతో తన తల్లి చేస్తున్న వర్కవుట్లను ప్రపంచానికి చూపించాలనుకున్నాడు అజయ్. ‘వెయిట్‌లిఫ్టర్ మమ్మీ’ అని ఇన్‌స్టాలో హ్యాండిల్ క్రియేట్ చేశాడు. ఆమె వర్కవుట్లు చేస్తున్న వీడియోలను అందులో పోస్టు చేస్తూ వచ్చాడు. 69 ఏండ్ల పెద్దమనిషి చేస్తున్న విన్యాసాలను చూసి యువతరం ఫిదా అవుతున్నది. ‘మా తుఝే సలామ్’ అంటూ జేజేలు పలుకుతున్నది. ‘ఇప్పుడు మీ కీళ్లనొప్పులు ఎలా ఉన్నాయి?’ అని ఎవరైనా ఆమెను ప్రశ్నిస్తే.. ‘ఏ కీలులోనూ నొప్పి లేదు. మునుపటి కన్నా ఆరోగ్యంగా ఉన్నా’ అని నవ్వుతూ సమాధానం చెబుతుంది రోష్ని. ‘వెయిట్‌లిఫ్టర్ మమ్మీ’ హ్యాండిల్‌కు సుమారు 34వేల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ‘ఇంత లేటు వయసులో ఇన్నేసి బరువులు మోసేస్తున్నా.. మీకెందుకు వర్కవుట్ కాదు’ అంటూ అడపాదడపా ఇన్‌స్టాలో చాలెంజ్ కూడా చేస్తుంటుంది రోష్ని.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

