భారత్, లంక యువ సవాల్
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్‌కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్‌కు కెప్టెన్-కోచ్‌గా శ్రీలంక సిరీస్‌తో మొదటి పరీక్ష ఎదురుకానుంది. ‘టార్గెట్-2026 టీ20 వరల్డ్ కప్' దిశగా భారత క్రికెట్ జట్టు తొలి అడుగు వేయనున్నది.
- కొత్త కోచ్, కెప్టెన్ హయాంలో తొలి పరీక్ష
- నేటి నుంచే భారత్, శ్రీలంక టీ20 సిరీస్
- రాత్రి 7 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
పల్లెకెలె (శ్రీలంక): సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్‌కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్‌కు కెప్టెన్-కోచ్‌గా శ్రీలంక సిరీస్‌తో మొదటి పరీక్ష ఎదురుకానుంది. ‘టార్గెట్-2026 టీ20 వరల్డ్ కప్’ దిశగా భారత క్రికెట్ జట్టు తొలి అడుగు వేయనున్నది. మరోవైపు రోహిత్, కోహ్లీ, జడేజా వంటి దిగ్గజాలు ఈ ఫార్మాట్లో తప్పుకోవడంతో లంకతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సత్తా చాటి వారి స్థానాలను భర్తీ చేయడంతో పాటు జట్టులో చోటు సుస్థిరం చేసుకునేందుకు కొత్తతరం కుర్రాళ్లు సిద్ధమవుతున్నారు. పల్లెకెలె స్టేడియం వేదికగా శనివారం నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్‌లో ఈనెల 28, 30న మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి.
గంభీర్-సూర్య శకం
రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన గంభీర్ మార్గనిర్దేశకత్వంలో సూర్య అండ్ కో. పై ఒక అవగాహనకు వచ్చేందుకు గౌతీకి ఇది మంచి అవకాశం. హెడ్‌కోచ్‌గా అనుభవం లేకపోయినా గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు లక్నో, కోల్‌కతాకు మెంటార్‌గా వ్యవహరించిన అతడు.. జట్టుపై తన మార్కు ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేందుకు గిల్, జైస్వాల్ వంటి కుర్రాళ్లకు ఇదే సువర్ణావకాశం. జడ్డూ స్థానాన్ని అక్షర్ పటేల్‌తో పూరించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ వారసుడిగా రేసులోకి వచ్చిన ‘మిస్టర్ 360’ ఆ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడనేది ఆసక్తికరం. సారథ్యం కోల్పోయినా జట్టుతో చేరిన పాండ్యా.. సూర్యతో ఎలా సమన్వయం చేసుకుంటాడో చూడాలి. బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో అర్ష్‌దీప్, సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

