ఆ జానర్ ఎప్పటికీ ఈ జానకిదే!
బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను ఏడిపించే జానకి.. కెమెరా ఆఫ్ అయితే మాత్రం సరదా కబుర్లు, జోక్‌లతో అందరిలో హుషారు నింపే జయశ్రీ. రీల్‌కి, రియల్‌కి ఏమాత్రం పొంతన లేకుండా ఉంటుందామె. అప్పుడే ఏడిపిస్తుంది, అంతలోనే కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది.
బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను ఏడిపించే జానకి.. కెమెరా ఆఫ్ అయితే మాత్రం సరదా కబుర్లు, జోక్‌లతో అందరిలో హుషారు నింపే జయశ్రీ. రీల్‌కి, రియల్‌కి ఏమాత్రం పొంతన లేకుండా ఉంటుందామె. అప్పుడే ఏడిపిస్తుంది, అంతలోనే కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది. పన్నెండేళ్ల ప్రాయంలో తెరకు పరిచయమైన ఈ కన్నడ కస్తూరి కన్నడ, మలయాళం, తమిళం, ఒడియా, హిందీతోపాటు తెలుగులోనూ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. జీ తెలుగు ‘పడమటి సంధ్యారాగం’ జానకిగా తెలుగువారికి బాగా దగ్గరైన జయశ్రీ రాజ్ జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
‘పడమటి సంధ్యారాగం’ సీరియల్లో నా ఫస్ట్ షాట్ ఇప్పటికీ గుర్తుంది. సోలో షాట్.. సెంటిమెంట్ సీన్. నిజానికి నాకు బాగా నప్పే జానర్ అది. సెంటిమెంట్ సీన్ అంటే నేనే కనబడాలి అనుకుంటా. పన్నెండేళ్ల వయసులోనే పరిశ్రమకు వచ్చాను. నా మొదటి సీరియల్ వెయ్యికిపైగా ఎపిసోడ్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా ప్రసారమైంది. ఆ వయసులో నాకు యాక్టింగ్ గురించి అంతగా తెలియదు. కానీ, ఒకసారి కెమెరా ముందుకు వచ్చాక నటనపై ఇష్టం పెరిగింది. దాన్నే కెరీర్‌గా మలుచుకోవాలని డిసైడ్ అయ్యా. ఇప్పటికి దాదాపు 50 సీరియల్స్‌లో హీరోయిన్గా చేశాను. కన్నడలో నలభై దాకా సినిమాల్లో నటించాను. తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీరియల్స్‌తోపాటు ఒక సినిమా చేశా. మంచి అవకాశాలు వస్తున్నాయి. పాజిటివ్, నెగెటివ్ అనే తేడా లేకుండా రకరకాల పాత్రలు పోషించాను. పలు అవార్డులూ అందుకున్నాను.
మాది సంప్రదాయ కుటుంబం. అన్నయ్య, నేను ఇద్దరమే అవడంతో నేను చాలా గారాబంగా పెరిగాను. మా తల్లిదండ్రులు అన్ని విషయాల్లో మాకు స్వేచ్ఛ ఇచ్చారు. ఆ విషయంలో ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను. అంతేకాదు మా కుటుంబంలో నేనే మొదటి నటిని. నా కెరీర్ ఆరంభం నుంచీ మా అమ్మానాన్నల మద్దతు ఉంది. చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించడంతో వరుస ప్రాజెక్ట్స్‌తో చదువుకోవడానికి సమయం ఉండేది కాదు. దీంతో స్కూల్‌కి, కాలేజీకి సరిగ్గా వెళ్లేదాన్ని కాదు. అయితే, చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశా.
నేను ఏ ప్రాజెక్ట్ ఒప్పుకొన్నా ఆ పాత్రలో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తా. రెండో షాట్ తీసుకోవడం నాకు నచ్చదు. ఇప్పటివరకు అలాంటి సందర్భం రాలేదు. అందుకే సెట్లో అందరూ నన్ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. ఏ విషయాన్నయినా తొందరగా నేర్చుకుంటాను. అది దేవుడిచ్చిన వరమే అని భావిస్తాను. మొదటిసారి తెలుగులో అవకాశం వచ్చినప్పుడు భాష రాదని ఒకింత కంగారుపడ్డాను. కానీ, మా ఆయన ధైర్యం చెప్పడంతో ఓకే అన్నాను. షూటింగ్ మొదలయ్యాక దర్శకుడు, సహనటులు, ప్రొడక్షన్ టీమ్ ఆదరణ చూసి ఆశ్చర్యపోయా. గొప్పగా అనిపించారు. సీరియల్ ప్రసారమయ్యాక ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడికి వెళ్లినా.. ‘పడమటి సంధ్యారాగం.. జానకి’ అంటూ ప్రేమగా పలకరిస్తారు. నాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చిన మల్లెమాల ప్రొడక్షన్స్‌కి థ్యాంక్స్.
కన్నడలో నా మొదటి సీరియల్ ‘మాయామృగ’. అందులో నా పాత్ర పేరు శారద. ఇప్పటికీ కన్నడిగులు ‘శారద’ అనే పిలుస్తారు. కన్నడ ప్రేక్షకులు తమ అభిమానాన్ని లైవ్‌లో చూపిస్తారు. అంటే వాళ్లను కలిసినప్పుడు ఆ అభిమానం తెలుస్తుంది. కానీ, తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకం. సోషల్ మీడియాలో వాళ్లు కురిపించే అభిమానం చాలా సంతోషాన్నిస్తుంది. నిజానికి నేను సోషల్ మీడియా పర్సన్‌ని కాదు. నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఏ విషయాలూ పంచుకోను. నా కుటుంబానికీ ప్రైవసీ ఉండాలని కోరుకుంటా. కానీ, నా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా ప్లీజ్ మేడమ్ అప్డేట్గా ఉండండి, రీల్స్ పెట్టండి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇందరి అభిమానం పొందడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరిన్ని మంచిపాత్రలతో మిమ్మల్ని అలరిస్తాను.
నటన చూసే అవకాశాలు
నా కెరీర్ ఆరంభం నుంచీ అవకాశం కోసం ఎవరినీ అడగలేదు. ఇప్పటివరకు కనీసం ఫొటో షూట్ కూడా చేయలేదు. నా నటన చూసే నాకు అవకాశాలు ఇచ్చారు. మా ఆయన కూడా పరిశ్రమకు చెందినవారే! దీంతో పెండ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించాను. మావారు, పాప నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మాకు నిర్మాణ సంస్థ ఉంది. కన్నడలో కొన్ని సినిమాలు, సీరియల్స్ నిర్మించాం. నటిగానే కాకుండా నిర్మాత, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగానూ బాధ్యతలు పోషిస్తున్నా. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటాను. బిజీ షెడ్యూల్స్ వల్ల నా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నా అనే బాధ తప్ప చాలా సంతోషంగా ఉన్నా.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

