మేమున్నాం.. మీకేం కాదు..
లైంగికదాడి, అఘాయిత్యాలకు గురైన మహిళలు, బాలికలకు మేమున్నాం.. అంటూ బరోసా కల్పిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పోక్సో, లైంగికదాడి కేసుల్లో బాధితులకు అన్ని విధాలా సహాయ,
- బాధితులకు ‘భరోసా’ ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు
- 196 మందికి అండగా నిలిచిన మేడ్చల్ భరోసా సెంటర్
- 120 మందికి రూ.43 లక్షల పరిహారం అందేలా చర్యలు
- ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణం
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): లైంగికదాడి, అఘాయిత్యాలకు గురైన మహిళలు, బాలికలకు మేమున్నాం.. అంటూ బరోసా కల్పిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పోక్సో, లైంగికదాడి కేసుల్లో బాధితులకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించి, వారికి తగిన న్యాయం జరిగేలా చూడటమే కాకుండా సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ పరిధిలోని మేడ్చల్‌లో భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సెంటర్ ప్రారంభించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వార్షికోత్సవానికి ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం డీసీపీ సృజన కర్ణం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోక్సో, లైంగికదాడి బాధితులు న్యాయపరంగా, సామాజికంగా ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం భరోసా సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. వీటి ద్వారా బాధిత మహిళలు, బాలికలకు తగిన న్యాయంతో పాటు పరిహారాన్ని కూడా అందించే బాధ్యతను భరోసా సెంటర్ నిర్వహిస్తున్నదన్నారు.
2022 నుంచి ఇప్పటి వరకు ఈ భరోసా సెంటర్ ద్వారా 196 మందికి అండగా నిలిచి, న్యాయ పరంగాను, వైద్యపరంగా, విద్యా, ఉద్యోగాల కల్పన పరంగాను కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందించామన్నారు. ఇందులో 143 మంది పోక్సో బాధితులు ఉండగా, 33 మంది లైంగికదాడి బాధితులు, ఇతర కేసులకు సంబంధించి మరో 20 మంది బాధితులు ఉన్నట్లు డీసీపీ వివరించారు. అంతేకాకుండా.. 120 మంది బాధితులకు రూ.43 లక్షల పరిహారం, 10 మంది బాధితులకు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద రూ.1.70లక్షల ఆర్థిక సహాయాన్ని ఇప్పించడం జరిగిందన్నారు.
116 హోమ్ విజిట్స్, 45 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 10 మంది బాధితులను షెల్టర్ హోమ్‌లకు తరలించగా.. 8 మంది బాలికలను పాఠశాలల్లో చేర్పించినట్లు వివరించారు. బాధిత మహిళలు, బాలికలకు చట్టపరంగా అందాల్సిన న్యాయం, ఆరోగ్యపరంగా అవసరమైన వైద్యం, సామాజిక భద్రత కల్పించేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ పరిధిలో పని చేస్తున్న భరోసా సెంటర్ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా డీసీపీ పలువురు బాధిత చిన్నారులను పలుకరించి తామున్నామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ ఇన్స్పెక్టర్ జేమ్స్‌బాబు, భరోసా సెంటర్ కో ఆర్డినేటర్ కళ్యాణితో పాటు భరోసా బృందం సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

