పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది?
1. ‘మూడుసార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది, ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు’ అని ఏ హైకోర్టు చెప్పింది?
- గ్రూప్స్ ప్రత్యేకం పాలిటీ బిట్స్
1. ‘మూడుసార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది, ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు’ అని ఏ హైకోర్టు చెప్పింది?
ఎ. అలహాబాద్ హైకోర్టు
బి. బాంబే హైకోర్టు
సి. ఢిల్లీ హైకోర్టు
డి. పాట్నా హైకోర్టు
2. కింది చట్టాల్లో ఏ చట్టం మొదటిసారి భారతీయులకు శాసన సభల్లో ప్రాతినిధ్యం కల్పించింది?
ఎ. భారతీయ కౌన్సిల్ చట్టం-1932
బి. భారతీయ కౌన్సిల్ చట్టం-1909
సి. భారతీయ కౌన్సిల్ చట్టం-1919
డి. భారత ప్రభుత్వ చట్టం-1935
3. 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింది వారిలో ఎవరిని వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా నియమించింది?
ఎ. డి.శ్రీనివాస్
బి. జూలూరి గౌరీశంకర్
సి. నారదాసు లక్ష్మణరావు
డి. బి.ఎస్.రాములు
4. రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారీ?
ఎ. రాష్ట్రపతి
బి. రాష్ట్ర ముఖ్యమంత్రి
సి. రాష్ట్ర శాసనసభ
డి. రాష్ట్ర మంత్రి మండలి
5. లోక్సభ, రాజ్య సభలను సంయుక్తంగా సమావేశపర్చేది ఎవరు?
ఎ. రాష్ట్రపతి బి. లోక్సభ స్పీకర్
సి. రాజ్యసభ చైర్మన్
డి. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి
6. భారత ప్రధానమంత్రిగా నియమించడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత?
ఎ. 30 సంవత్సరాలు బి. 25 సంవత్సరాలు
సి. 21 సంవత్సరాలు డి. 35 సంవత్సరాలు
7. మంత్రి మండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
ఎ. రాష్ట్రపతి బి. లోక్సభ
సి. రాజ్యసభ డి. ప్రధానమంత్రి
8. ఉప రాష్ట్రపతి దేనికి పదవీరీత్యా
(ఎక్స్అఫీషియో) చైర్మన్?
ఎ. జాతీయ అభివృద్ధి సంఘం
బి. రాజ్యసభ సి. లోక్సభ
డి. నీతి ఆయోగ్
9. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం ఏది?
ఎ. ఉదయించే సూర్యుడు
బి. చీపురు కట్ట
సి. మోటార్ సైకిల్ డి. ఏనుగు
10. భారతదేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో ఉభయ సభల శాసన వ్యవస్థ ఉన్నది?
ఎ. జార్ఖండ్
బి. జమ్మూ కశ్మీర్
సి.ఉత్తరప్రదేశ్ డి. ఛత్తీస్గఢ్
12. 1993లో కింద తెలిపిన రాజ్యాంగ సవరణలో ఏది భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల్లో విస్తృతంగా మార్పులను తీసుకువచ్చింది?
ఎ. 86వ సవరణ బి. 25వ సవరణ
సి. 73వ సవరణ డి. 44వ సవరణ
13. పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు?
ఎ. జిల్లా కలెక్టర్
బి. పంచాయతీరాజ్ పాలన శాఖ
సి. స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం
డి. భారత ఎన్నికల కమిషన్
14. శాసనసభ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి (2017 ఎన్నికలకు వెళ్లిన) కింది రాష్ర్టాలను ఆరోహణ క్రమంలో అమర్చండి?
ఎ.పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్
బి.గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్
సి.గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్,
డి.మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరప్రదేశ్
15. మంత్రి మండలికి నేతృత్వం వహిస్తూ లోక్సభలో మైనారిటీ సభ్యుల మద్దతు పొందే వ్యక్తి పదవి ఏది?
ఎ. రాష్ట్రపతి బి. ప్రధానమంత్రి
సి. స్పీకర్ డి. ప్రధాన న్యాయమూర్తి
16. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ (వ్యాఖ్యానం) తెలిపే అంతిమ అధికారం ఏ వ్యవస్థకు ఉంది?
ఎ. లోక్సభ బి. సుప్రీంకోర్టు
సి. రాష్ట్రపతి డి. రాజ్యసభ
17. అండమాన్, నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి?
ఎ. మద్రాసు బి. బొంబాయి
సి. కలకత్తా డి. హైదరాబాద్
18. పార్లమెంట్ సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి?
ఎ. రాజీవ్ గాంధీ
బి. మన్మోహన్సింగ్
సి. పి.వి. నరసింహారావు
డి. దేవేగౌడ
19. జెర్రీ మాండరింగ్ దేన్ని సూచిస్తుంది?
ఎ. క్రాస్ ఓటింగ్
బి. పోలింగ్ బూత్ల దురాక్రమణ
సి. గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం
డి. ఓ అభ్యర్థికి అనుకూలంగా ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి ఓటు వేయడం
20. భారతదేశంలో ఒక రాష్ర్టానికి తొలి మహిళా ముఖ్యమంత్రి?
ఎ. జయలలిత
బి. సరోజిని నాయుడు
సి. మాయావతి
డి. సుచేత కృపలాని
21. 329ఏ అధికరణను భారత రాజ్యాంగం ఏ సవరణ ద్వారా తొలగించింది?
ఎ. 78 బి. 79 సి. 44 డి. 42
22. వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షురాలిగా కాకా కాలేల్కర్ నియామకం ఎప్పుడు జరిగింది?
ఎ. 1951 బి. 1953
సి. 1954 డి. 1952
23. భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది?
ఎ. 26 నవంబర్, 1949
బి. 26 జనవరి, 1950
సి. 15 ఆగస్టు, 1947
డి. 1 జనవరి, 1948
24. లోక్సభలో స్పీకరు, డిప్యూటీ స్పీకరు లేనప్పుడు సభ కార్యక్రమాల్ని ఎవరు నిర్వహిస్తారు?
ఎ. చైర్మన్ బి. వైస్ చైర్మన్
సి. ప్యానెల్ స్పీకర్ డి. వైస్ స్పీకర్
25. అధ్యక్ష పదవికి అర్హత కానిది ఏది?
ఎ. భారత పౌరసత్వం
బి. 35 ఏళ్లకు తక్కువ కాని వయస్సు
సి. లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడటానికి అర్హత కలిగి ఉండటం
డి. ఏ శాసన సభలోనైనా సభ్యత్వం కలిగి ఉండటం
26. భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం.. ఎందుకంటే?
ఎ. అందులో ఎటువంటి వంశ
పారంపర్య అంశాలు లేవు
బి. అది భారత ప్రజలకు సంబంధించింది
సి. అది సవరించకూడనిది
డి. అది పార్లమెంటుకు చాలా అధికారాలను ఇస్తుంది
27. అతి పురాతనమైన హైకోర్టు ఏది?
ఎ. బొంబాయి, మద్రాసు హైకోర్టు
బి. బొంబాయి, కలకత్తా హైకోర్టు
సి. కలకత్తా, మద్రాసు హైకోర్టు
డి. మద్రాసు, అలహాబాద్ హైకోర్టు
28. భారతదేశంలోని అత్యంత పురాతన పార్టీ ఏది?
ఎ. భారతీయ జనతా పార్టీ
బి. భారతీయ కాంగ్రెస్ పార్టీ
సి. భారత కమ్యూనిస్ట్ పార్టీ
డి. బహుజన సమాజ్ పార్టీ
29. కింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు?
ఎ. శంకర్ దయాళ్ శర్మ
బి. సర్వేపల్లి రాధాకృష్ణన్
సి. జాకీర్ హుస్సేన్
డి. రాజేంద్ర ప్రసాద్
30. కింది వారిలో ఎవరు అతి తక్కువ వయస్సులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు?
ఎ. మొరార్జీ దేశాయ్
బి. చరణ్ సింగ్
సి. ఇందిరాగాంధీ
డి. రాజీవ్ గాంధీ
31. కింది వారిలో ఎవరు అతి ఎక్కువ కాలం (17 ఏళ్లు) ప్రధానమంత్రిగా ఉన్నారు?
ఎ. లాల్ బహదూర్ శాస్త్రీ
బి. మొరార్జీ దేశాయ్
సి. జవహర్లాల్ నెహ్రూ
డి. ఇందిరా గాంధీ
32. కింది వాటిలో ప్రాంతీయ పార్టీ కానిది ఏది?
ఎ. తెలుగు దేశం పార్టీ
బి. తెలంగాణ రాష్ట్ర సమితి
సి. త్రుణమూల్ కాంగ్రెస్
డి. అకాలీదళ్
33. పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది?
ఎ. 10వ షెడ్యూల్ బి. 11వ షెడ్యూల్
సి. 9వ షెడ్యూల్ డి. 8వ షెడ్యూల్
34. ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనేది కింది వాటిలో దేని నినాదంగా ఉంది?
ఎ. అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం
బి. ఫ్రెంచి విప్లవం
సి. రష్యా విప్లవం
డి. భారత స్వాతంత్య్ర సంగ్రామం
35. భారతదేశంలో పార్లమెంట్లోని లోక్సభకు, రాష్ర్టాల శాసన సభలకు ఏ ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతాయి?
ఎ. అత్యధిక మెజారిటీ పద్ధతి
బి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి
సి. జాబితా పద్ధతి
డి. హేర్ పద్ధతి
36. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం ఆరు సూత్రాల పథకాన్ని సూచిస్తుంది?
ఎ. 370 బి. 371
సి. 371-డి డి. 371-సి
37. భారతదేశం స్వయంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న సంవత్సరం ఏది?
ఎ. 1942 బి. 1945
సి. 1950 డి. 1940
38. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణను అనుసరించి రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు?
ఎ. ప్రకరణ 352 బి. ప్రకరణ 354
సి. ప్రకరణ 356 డి. ప్రకరణ 36
39. నగర పాలక సంస్థ అధిపతి ఎవరు?
ఎ. చైర్మన్ బి. మేయర్
సి. ప్రెసిడెంట్ డి. కమిషనర్
40. స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ. భారత ఎన్నికల సంఘం
బి. రాష్ట్ర ఎన్నికల కమిషన్
సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి. జిల్లా కలెక్టర్
41. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
ఎ. రాష్ట్రపతి బి. ప్రధాన మంత్రి
సి. భారత ఎన్నికల సంఘం
డి. సుప్రీంకోర్టు
42. భారతదేశంలోని రాష్ర్టాల్లో దేనిలో పోర్చుగల్ సివిల్ కోడ్ ఇంకా అమల్లో ఉంది?
ఎ. ఢిల్లీ బి. త్రిపుర
సి. గోవా డి. కేరళ
43. కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించింది?
ఎ. అధికరణ 46 బి. అధికరణ 47
సి. అధికరణ 48 డి. అధికరణ 49
44. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని కింది వాటిలో దేనిలో ప్రవేశపెట్టారు?
ఎ. లోక్సభలో
బి. రాజ్యసభలో
సి. పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో
డి. పార్లమెంట్లోని ఏదేని సభలో
45. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ ఎవరి ఆదేశాల పేరుతో నిర్వహిస్తారు?
ఎ. రాష్ట్రపతి బి. గవర్నర్
సి. ముఖ్యమంత్రి డి. స్పీకర్
46. భారత జాతీయ గీతం ఆలపించడం, పూర్తి చేయాల్సిన సరైన సమయం ఏది?
ఎ. 56 సెకన్లు బి. 53 సెకన్లు
సి. 52 సెకన్లు డి. 58 సెకన్లు
47. కింది వాటిలో ఏ కమిషన్ ఒక రాష్ర్టానికి గవర్నర్ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది?
ఎ. మదన్మోహన్ పూంచి కమిషన్
బి. సర్కారియా కమిషన్
సి. మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్డి. వెంకటాచలయ్య కమిషన్
48. కింది వాటిలో భౌగోళికంగా భారతదేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది?
ఎ. మల్కాజిగిరి, తెలంగాణ
బి. లఢఖ్, జమ్మూ కశ్మీర్
సి. బార్మర్, రాజస్థాన్
డి. కచ్, గుజరాత్
జవాబులు
1.ఎ 2. బి 3.డి 4. ఎ 5.ఎ 6. బి 7.బి 8. బి 9. బి 10.సి 11.డి 12. సి 13.సి 14.బి 15.బి 16. బి 17.సి 18.సి 19.సి 20. సి 21.సి 22.బి 23.ఎ 24. సి 25.డి 26.ఎ 27.బి 28. బి 29.సి 30.డి 31.సి 32. సి 33.ఎ 34.డి 35.ఎ 36. సి 37.సి 38.సి 39.బి 40. బి 41.ఎ 42.సి 43.బి 44. బి 45.సి 46.ఎ 47.బి 48.బి
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

