Polio risk | గాజాలోని చిన్నారులకు పొంచి ఉన్న పోలియో ముప్పు.. నీళ్లలో వైరస్ అవశేషాలు..!
Polio risk | ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని ఆరోగ్య వ్యవస్థ కూడా దారుణంగా తయారైంది.
Polio risk : ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని ఆరోగ్య వ్యవస్థ కూడా దారుణంగా తయారైంది. దాంతో అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే స్థానిక నీటి నమూనాల్లో పోలియో కారక వైరస్ అవశేషాలను గుర్తించారు.
దాంతో వ్యాధి నిరోధక చర్యలకు ఉపక్రమించిన డబ్ల్యూహెచ్‌వో (WHO).. అక్కడి చిన్నారులకు 10 లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఇక్కడ ఒక్క పోలియో కేసు కూడా నమోదు కానప్పటికీ తక్షణమే చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధి బారినపడేందుకు మరెంతో సమయం లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధం కారణంగా గడిచిన తొమ్మిది నెలలుగా వ్యాక్సిన్ పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయని, దాంతో ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి ముప్పు అధికంగా ఉందని, రెండేళ్ల లోపు శిశువులకు ఇది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోలియోమైలిటిస్ వైరస్ కారణంగా సంభవించే ఈ వ్యాధి.. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

