Maharaja | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్టార్ యాక్టర్లలో ఒకరు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తాజాగా ఇదే జోనర్లో ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా మహారాజ (Maharaja) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వస్తోన్న మహారాజ జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కేకే నగర్లో సెలూనే షాప్ నిర్వహించే వ్యక్తి (విజయ్‌సేతుపతి) చుట్టూ సాగే కథతో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ చెబుతోంది. ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారంటూ ఫిర్యాదు చేయాలనుకున్న విజయ్ సేతుపతి ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు. లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్స్ అని పోలీసులు అడిగితే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు.. భార్య కాదు.. అక్కాచెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరయ్యా అంటూ పోలీసులు అడిగే ప్రశ్నలతో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ పెంచుతోంది. ఇంతకీ లక్ష్మి ఎవరనేది థియేటర్లలో చూడాల్సిందే మరి.
అయితే సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ఇప్పుడు మరో కొత్త ట్రైలర్ రెడీ చేసింది విజయ్ సేతుపతి టీం. త్వరలోనే నయా ట్రైలర్ విడుదల కానుందన్న వార్త మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. మహారాజ ఫస్ట్ లుక్ పోస్టర్, రషెస్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
#Maharaja carrying super expectations & also having good talks about the content of the film👌
Team is ready with a New Trailer which will add up more hype & it will be releasing soon 🤞 pic.twitter.com/6GuPHMf97A
— AmuthaBharathi (@CinemaWithAB) June 11, 2024
మహారాజా ట్రైలర్..
మహారాజా ఫస్ట్ లుక్ ..
#MaharajaFirstLook@Dir_nithilan @PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP @ActionAnlarasu @ThinkStudiosInd @infinit_maze @jungleeMusicSTH @Donechannel1 #VJS50FirstLook #VJS50… pic.twitter.com/7fF5Y2rDao
— VijaySethupathi (@VijaySethuOffl) September 10, 2023