బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన గెలుపు ఖాయమైన అనంతరం కేపీసీసీ చీఫ్ డేకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. పార్టీ గెలుపులో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి పాత్ర ఉందని అన్నారు. మీరే సీఎం కావాలని మీ మద్దతుదారులు కోరుకుంటున్నారుగా.. మరి మీరు రేసులో ఉన్నారా..? అన్న మీడియా ప్రశ్నతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో తనకు మద్దతుదారులంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరని, మొత్తం కాంగ్రెస్ పార్టీయే తనకు మద్దతుగా ఉన్నదని భావోద్వేగంతో చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాము చాలా కష్టపడ్డామన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌లోని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు, రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా తమకు సహకరించారని చెప్పారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా పార్టీని గెలిపించడంలో తనకు మద్దతు నిలిచారని తెలిపారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తన ఒక్కడిది కాదని, పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అందరి మద్దతుతోనే ఈ గెలుపు సాధ్యమైందని చెప్పారు. పార్టీ సమష్టి కృష్టితో ఇవాళ కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నామని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబంపై కర్ణాటక ప్రజలు విశ్వాసం ఉంచారని చెప్పారు. రాష్ట్రస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నేతలు తీవ్రంగా శ్రమించారని చెప్పారు. అయితే, తాను సీఎం రేసులో ఉన్నారో లేరో అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
#WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party’s comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr
— ANI (@ANI) May 13, 2023
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్