RR vs KKR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో టేబుల్ టాపర్స్ ఫైట్‌కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. గువాహటిలో వాన కారణంగా రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkatga Knight Riders) మ్యాచ్ ఆలస్యం కానుంది. టాస్ సమయానికి ముందే చినుకులు మొదలవ్వడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండిపోయారు. వాన తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్ వేయనున్నారు.
ప్రస్తుతం కోల్‌కతా 9 విజయాలతో టాప్‌లో ఉండగా.. 8 మ్యాచుల్లో గెలుపొందిన సంజూ సేన ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన రాజస్థాన్ ఆఖరి పోరులో విజయంపై కన్నేసింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెడుతుంది.