ఖాళీ కుర్చీకి వినతి
ప్రజల సమస్యలను పరిషరించాల్సిన బాధ్యత కలిగిన అధికారులే గైర్హాజరైతే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? నాచారం సరిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సరిగ్గా ఇదే దుస్థితి ఎదురైంది.
- వినూత్నంగా నిరసన తెలిపిన జేఏసీ చైర్మన్ నల్ల రాధాకృష్ణ
సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రజల సమస్యలను పరిషరించాల్సిన బాధ్యత కలిగిన అధికారులే గైర్హాజరైతే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? నాచారం సరిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సరిగ్గా ఇదే దుస్థితి ఎదురైంది. అక్రమ నిర్మాణాలు, షట్టర్ల అక్రమ వినియోగంపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ నల్ల రాధాకృష్ణ వచ్చారు. అయితే వినతులు స్వీకరించాల్సిన మున్సిపల్ అధికారులు ఒకరు కూడా సీటుపై అందుబాటులో లేకపోవడంతో నివ్వెరపోయారు. ప్రజావాణి పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, ఖాళీగా ఉన్న అధికారి కుర్చీకే తన వినతిపత్రాన్ని సమర్పించిన రాధాకృష్ణ నిరసన తెలిపారు.
నాచారం సరిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా షట్టర్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. వీటిపై ఆధారాలతో సహా అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎంఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం స్పందించకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందన్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారి వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

