యూరప్‌లో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి
యూరప్‌లో హ్యాకర్లు సరికొత్త తరహా సైబర్ దాడికి పాల్పడ్డారు. ఏకంగా ఏడు దేశాల్లోని సూపర్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను అమాంతం 70 డిగ్రీలకు పెంచేశారు.
- ఏడు దేశాల్లో ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు హ్యాక్
- భారీగా పాడైన ఆహార పదార్థాలు
స్వీడన్: యూరప్‌లో హ్యాకర్లు సరికొత్త తరహా సైబర్ దాడికి పాల్పడ్డారు. ఏకంగా ఏడు దేశాల్లోని సూపర్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను అమాంతం 70 డిగ్రీలకు పెంచేశారు. దీంతో వాటిలో నిల్వ ఉంచిన పాలు, మాంసం, ఇతర ఆహార పదార్థాలు పాడైపోయాయి. లక్షల యూరోల విలువైన సరుకులను నిర్వాహకులు చెత్తలో పడేయాల్సి వచ్చింది. బెల్జియం, స్వీడన్, నెదర్లాండ్స్, ఎస్టోనియా, లగ్జెంబర్గ్, ఫిన్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో ఈ దాడులు జరిగినట్లు వెల్లడైంది.
స్వీడన్ ఐసీఏ, కూప్ సూపర్ మార్కెట్లకు చెందిన దుకాణాలు ఈ దాడికి ప్రభావితమయ్యాయి. కూప్‌కు చెందిన ఆరు స్టోర్లలో సమస్యలు తలెత్తగా, కొన్ని చోట్ల ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు చేరినట్లు సమాచారం. బెల్జియంలో డల్హైజ్కు చెందిన సుమారు 40, కార్పోస్కు చెందిన 15, స్పార్కు చెందిన ఐదు దుకాణాల్లోనూ రిఫ్రిజిరేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పాడైన ఆహార పదార్థాల విలువ భారీగా ఉన్నట్లు తెలుస్తున్నది. లగ్జెంబర్గ్లోనూ ఇలాంటి సమస్యలు వెలుగు చూశాయి.
దీనిపై ఏహోల్డ్ డల్హైజ్ సంస్థ దర్యాప్తు చేపట్టింది. బెల్జియం సంస్థ సబ్కోబెల్ సీఈవో స్టీఫాన్ మోలెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం హ్యాకర్లు ఫ్రిజ్‌ల కూలింగ్ యూనిట్లను డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మార్చారు. సాధారణంగా ఫ్రిజ్‌లో పేరుకుపోయిన మంచును కరిగించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ సమయంలో శీతలీకరణ నిలిచిపోవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. ఈ సమస్యలను కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్తో పరిష్కరించడం సాధ్యం కాదని, ఫ్రిజ్‌ల వ్యవస్థల్లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్‌పై సైబర్ దాడులు
కీవ్/ మాస్కో: రష్యా, ఉక్రెయిన్లలో అత్యవసర హెచ్చరికలు జారీ చేసే మొబైల్ యాప్‌లపై సైబర్ దాడులు జరిగాయి. హ్యాకర్లు ఈ వ్యవస్థల్లోకి చొరబడి అణు దాడులు, రసాయన ముప్పు, రేడియేషన్ ప్రమాదాలకు సంబంధించిన తప్పుడు హెచ్చరికలను ప్రజలకు పంపించారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌లో వైమానిక దాడుల గురించి ప్రజలను అప్రమత్తం చేసే యాప్ ఆదివారం రాత్రి సైబర్ దాడికి గురైంది. దీంతో రాజధాని కీవ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అణు, రసాయన ముప్పులు పొంచి ఉన్నాయంటూ తప్పుడు సందేశాలు వెలువడ్డాయి. కొన్ని గంటల్లోనే రష్యా అత్యవసర పరిస్థితులశాఖకు చెందిన మొబైల్ యాప్‌పైనా సైబర్ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అణు వార్హెడ్ల డ్రోన్లు దేశంపై దాడికి బయలుదేరాయంటూ నకిలీ హెచ్చరికలు వెలువడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూరప్‌లో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి
విద్యుదాఘాతంతో రాజస్థాన్‌లో 8 మంది మృతి
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

