బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత..
ఈ ప్రశ్న బోన్ మ్యారో (ఎముక మజ్జ) ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎన్నిరోజులకు ఒకసారి హాస్పిటల్‌కి రావాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదని అడుగుతారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేసే పిల్లలకు కీమో థెరపీ, రేడియో థెరపీ, కండీషనింగ్ థెరపీ ఇస్తాము. కీమో థెరపీ, రేడియో థెరపీ, కండీషన్ థెరపీ వల్ల శరీరంలో రోగ నిరోధకత (ఇమ్యూనిటీ) తగ్గుతుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ల బారినపడతారు. కాబట్టి ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత వచ్చే సమస్యలను గుర్తించేందుకు తరచుగా వైద్య పరీక్షలు చేస్తూ ఉండాలి.
ఈ ప్రశ్న బోన్ మ్యారో (ఎముక మజ్జ) ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎన్నిరోజులకు ఒకసారి హాస్పిటల్‌కి రావాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదని అడుగుతారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేసే పిల్లలకు కీమో థెరపీ, రేడియో థెరపీ, కండీషనింగ్ థెరపీ ఇస్తాము. కీమో థెరపీ, రేడియో థెరపీ, కండీషన్ థెరపీ వల్ల శరీరంలో రోగ నిరోధకత (ఇమ్యూనిటీ) తగ్గుతుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ల బారినపడతారు. కాబట్టి ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత వచ్చే సమస్యలను గుర్తించేందుకు తరచుగా వైద్య పరీక్షలు చేస్తూ ఉండాలి.
మొదటి మూడునెలలు త్వరత్వరగా వైద్య పరీక్షలు చేస్తారు. మూడు నెలల నుంచి ఏడాది వరకు అప్పుడప్పుడూ వైద్య పరీక్షలు చేయాలి. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జ్వరం, ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటిని గమనిస్తూ ఉండాలి. అలాగే రక్తంలో రక్త కణాలు, ప్లాస్మా ఎంత ఉందో తెలుసుకుంటూ ఉండాలి. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత పూర్తిగా రికవరీ అయిందా? లేదా? తెలుసుకోవాలి. ట్రాన్స్‌ప్లాంట్ వల్ల చర్మంపై దద్దుర్లు రావొచ్చు. లివర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటే కామెర్లు వస్తాయి. ఎంజైమ్స్ తగ్గుతాయి. పేగులపై ప్రభావం చూపితే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతాయి. రక్త కణాల సంఖ్య, ఇన్ఫెక్షన్లు, అవయవాలపై ప్రభావం తెలుసుకునేందుకు తరచుగా వైద్యులు చెప్పినప్పుడు పరీక్షలు చేయిస్తూ ఉండాలి.
ట్రాన్స్‌ప్లాంట్ చేసిన పిల్లల్లో గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల వచ్చిన వ్యాధినిరోధక శక్తి పూర్తిగా పోతుంది. కాబట్టి ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఆ వ్యాక్సిన్లు ఇవ్వాలి. కొంతమంది పిల్లలకు లేట్ (లాంగ్ టర్మ్) సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రజస్వల, హార్మోన్, థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. టీనేజర్స్‌లో డిప్రెషన్, యాంగ్జయిటీ ఉంటుంది. వీళ్లకు సైకలాజికల్ సపోర్ట్ ఉండాలి. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత తాజా పండ్లు, కూరగాయలే తినాలి. పరిశుభ్రమైన, ఉడికించిన ఆహారమే తీసుకోవాలి. నిల్వ ఆహారం తినకూడదు. ఇన్ఫెక్షన్ రిస్క్ మూడు నెలలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటికిపోతే మాస్క్ ధరించాలి. రద్దీగా ఉన్నప్పుడు జనంలోకి వెళ్లొద్దు.
డాక్టర్ నల్లా అనురాగ్ రెడ్డి
పీడియాట్రిక్ హిమటాలజిస్ట్
ఆంకాలజిస్ట్, బ్లడ్ & మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్ , పిల్లల పెంపకం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత..
యూరప్‌లో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి
విద్యుదాఘాతంతో రాజస్థాన్‌లో 8 మంది మృతి
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

