Rain Alert | సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, బోయినపల్లి, మారేడుపల్లి, జవహర్నగర్ ప్రాంతాల్లో వానపడుతున్నది. సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, పేట్బషీరాబాద్తో పాటు పలుచోట్ల జల్లులు కురిశాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, అల్వాల్తో పాటు పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. పొద్దంతా ఎండ దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని నల్లటి మేఘాలు కమ్మేయడంతో ఒక్కసారిగా చల్లబడింది. పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి.