Priya Adhikari : పొరుగుదేశమైన నేపాల్‌లో అకస్మిక వరదల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారి గుండెధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలుపన్నదే లేకుండా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేసిన వారిలో పైలట్స్ సేవలు ప్రధానమైనవి. వీరిలో 40 ఏళ్ల ప్రియా అధికారి (Priya Adhikari) ఒకరు. ఎక్కడచూసినా మేట వేసిన బురద, మృత్యుదిబ్బగా మారిన ప్రాంతంలో ఆమె నేర్పుగా హెలీక్యాప్టర్ నడిపి.. శభాష్ అనిపించుకున్నారు. ఆ దేశ తొలి మహిళా హెలిక్యాప్టర్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ప్రియ పురుషులతో ధీటుగా రెస్క్యూలో పాల్గొంది. విపత్కాలంలో వెనకడుగు వేయకుండా.. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా వందకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆమెను కొనియాడుతున్నారంతా.
నేపాల్ వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. నేపాల్ – టిబెట్ సరిహద్దులో చిక్కుకున్న వందలాది మందిని హెలీక్యాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు పురుషులే కెప్టెన్లుగా ఉన్న ఈ మిషన్‌లో ప్రియా అధికారి ఒక్కరే మహిళ. నేపాల్ మొదటి మహిళా కెప్టెన్‌గా రికార్డు సాధించిన ప్రియ.. వరద తీవ్రతకు తమకు సైతం సహాయక చర్యల్లో పాల్గొనడం సవాల్ విసిరిందని అంటోంది.
Priya Adhikari is Nepal’s first female helicopter captain and she’s flown over 100 rescue missions in the wake of the devastating flood. Anderson speaks with her about what she’s witnessed. pic.twitter.com/3YYXHZA60J
— Anderson Cooper 360° (@AC360) September 1, 2026
వరద ఉధృతికి అతలాకుతలమైన రసువా జిల్లాలోని తిమురే గ్రామంలో.. దాదాపు ఇరవైకి పైగా హెలిక్యాప్టర్లు ఒకేసారి ల్యాండ్ అయ్యేవి. పైలట్స్ రేడియోలో నిరంతరం మాట్లాడుతూ అక్కడ చిక్కుకున్న వారిని తరలించారు. ఈ భారీ మిషన్‌లో పైలట్స్‌ను సమన్వయం చేసుకుంటూ అలుపెరగకుండా సేవలందించింది ప్రియ. వరద బాధితులతో పాటు.. ఎవరెస్ట్ పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకులను సైతం కాపాడిందీ ధీరవనిత. అందుకోసం ఏకంగా 6,200 మీటర్ల ఎత్తులో హెలీక్యాప్టర్‌ను నడిపింది ప్రియ.
Priya Adhikari, Nepal’s first woman helicopter captain, has flown around 100 rescue missions as choppers evacuated hundreds of flood survivors at the Nepal-Tibet border. She says the scale of the disaster has tested even her high-altitude rescue experience.
Read More:… pic.twitter.com/St3udA0tka
— IndiaToday (@IndiaToday) September 1, 2026
తాజా మిషన్ గురించి మాట్లాడిన ప్రియా.. ‘పైలట్స్ నిరంతరం రేడియో ద్వారా సమన్వయం చేసుకునేవాళ్లం. బాధితులను రక్షించేందుకు ఒకేచోట ఏకకాలంలో ఐదారు విమానాలు దిగేవి. తిమురేలో వరదల తీవ్రతకు మంది చనిపోయారు. వందలాది మంది చిక్కుకుపోయారు. మేము దాదాపు రెండొందలకు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. వరదల్లో ఐదు హైడ్రోపవర్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. వెయ్యికిపైగా చనిపోయారు. ఇంత విషాదంలోనూ నేను హెలీక్యాప్టర్ ఆపిన చోట జనం కనిపిస్తే హమ్మయ్య వీరినైనా కాపాడగలను అని నా ముఖంలో నవ్వు విరిసేది. వారితో.. మీరు బతికిపోయారు అని చెప్పేదాన్ని. వాళ్లెవరూ నాకు బంధువులు కాదు. కానీ, ఈ మిషన్ సమయంలో బాధితులను తరలిస్తున్నప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనయ్యా’ అని వెల్లడించింది.
హెలీక్యాప్టర్ కెప్టెన్‌గా ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన ప్రియ అనుకోకుండా ఇటువైపు వచ్చింది. బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివిన ప్రియ ఓసారి హెలీక్యాప్టర్ రైడ్‌కు వెళ్లింది. అంతే.. ఆ క్షణంలోనే పైలట్ అవ్వాలనే కోరిక ఆమెలో బలంగా నాటుకుంది. ‘నేను హెలీక్యాప్టర్ పైలట్ అయితే ఎలా ఉంటుంది?’ అని ప్రియ కెప్టెన్‌ను అడిగింది. నాలుగు నెలల్లోనే ఫిలీప్పీన్స్ వెళ్లి పైలట్ శిక్షణ తీసుకుంది ప్రియ. తొలుత క్యాబిన్ క్రూగా పనిచేసిన ఆమె హెలీక్యాప్టర్పై మనసు పారేసుకుంది.

కెప్టెన్ హోదాకు అవసరమైనన్ని గంటలు హెలీక్యాప్టర్ నడిపింది. 2017లో పూర్తిస్థాయిలో పైలట్‌గా కెరీర్ ప్రారంభించింది ప్రియ. ఇదివరకూ ప్రకృతి విప్తత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న తనకు తాజా వరదలు పరీక్ష పెట్టాయని చెబుతుందామె. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ రెస్క్యూ నిర్వహించేలా మేము శిక్షణ పొందాం అని గర్వంగా అంటోంది ప్రియ. భవిష్యత్‌లో మరింతమంది మహిళలు కెప్టెన్స్‌గా చూడాలనునకుంటున్న తను తల్లి కోరిక మేరకు ఎంబీఏ కూడా పూర్తి చేసింది.