తిరుపతి : తిరుపతి ( Tirupati ) పట్టణంలో ఘోర ప్రమాదం ( Tragic Accident ) జరిగింది. క్రేన్ కూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం ( Workers Died ) పాలయ్యారు. డీబీఆర్ రోడ్డు ప్రాంతంలో జరుగుతున్న భవన నిర్మాణ ప్రాంతంలో క్రేన్ ఒక్కసారిగా కుప్ప కూలింది.
దీంతో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.