Watch: స్మశానవాటికలో క్షుద్రపూజలు.. కాలుతున్న శవం నుంచి మాంసం తిన్న మంత్రగత్తె
Tantric Rituals In Ujjain Cremation | ఒక మంత్రగత్తె స్మశానవాటికలో క్షుద్రపూజలు చేసింది. చితిపై కాలుతున్న శవానికి చెందిన మాంసాన్ని ఆమె తిన్నది. తాము ఇలాగే చేస్తామని ఆ తాంత్రికురాలు పేర్కొన్నది. ఈ భయానక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: ఒక మంత్రగత్తె స్మశానవాటికలో క్షుద్రపూజలు చేసింది. చితిపై కాలుతున్న శవానికి చెందిన మాంసాన్ని ఆమె తిన్నది. తాము ఇలాగే చేస్తామని ఆ తాంత్రికురాలు పేర్కొన్నది. ఈ భయానక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Tantric Rituals In Ujjain Cremation) మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక స్మశానంలో కాలుతున్న చితి వద్ద ఒక మంత్రగత్తె తాంత్రిక పూజలు చేస్తున్నట్లు కనిపించింది. కాళీనంద్ గిరిగా గుర్తించిన ఆమె ఒళ్లంతా బూడిద పూసుకుని, నల్లని వస్త్రం ధరించింది. ఒరలోంచి కత్తిని బయటకు తీసి మండుతున్న చితిలో ఎముకలు, పుర్రె, మాంసం కోసం వెతికింది. కాలుతున్న శవానికి చెందిన ఒక మాంసం ముద్దను బయటకు తీసి తిన్నది. ‘చూడండి. ఇది చాలా వేడిగా ఉన్నది. ఇప్పుడే మంటల నుంచి బయటకు తీశాను. ఇది రుచిగా ఉంటుంది. నాకు తెలిసిన చాలా మంది తాంత్రికులను చంపేశాను. నా విషయంలో జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె హెచ్చరించింది.
కాగా, బూడిద పూసుకోవడం, మనుషుల పుర్రెలతో ఆడటం వంటివి తమ పని అని ఆ తాంత్రికురాలు తెలిపింది. ‘మా గురించి మీకు తెలిసే ఉంటుంది. మేం మనుషులను ఇలాగే తింటాం. ఇదే మా జీవితం. మేం ఏమేమి చేస్తామో మీరు కనీసం ఊహించలేరు కూడా’ అని ఆమె అన్నది. చివరలో ఒక మంత్రాన్ని కూడా ఆ మంత్రగత్తె జపించింది. అయితే ఈ సంఘటన ఏ స్మశానవాటికలో, ఎప్పుడు జరిగింది అన్నది తెలియలేదు.
మరోవైపు ఆ తాంత్రికురాలి వికృత చర్యకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఆచారంలో భాగంగా చితిపై కాలుతున్న మృతదేహాన్ని ఆమె విచ్ఛిన్నం చేసి, మానవ మాంసాన్ని తినడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుపాలని చాలా మంది డిమాండ్ చేశారు.
“मप्र। उज्जैन जिले में कथित अघोरी द्वारा तंत्र-मंत्र साधना के नाम पर श्मशान में शव के साथ छेड़छाड़ का
वीडियो हुआ वायरल, काली नंद गिरि नाम का व्यक्ति श्मशान में जलती चिताओं के पास शव के मांस का सेवन करता हुआ दिखाई दे रहा है।https://t.co/ToZHA8HJgZ pic.twitter.com/tfcZV505iq— Rakesh Yadav (@RakeshY29718307) August 31, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

