Kaloji University : తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల విద్యార్థుల్లో కొందరు ఎస్టీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం కలకలం రేపుతోంది. నకిలీ ఎస్టీ ధ్రువపత్రాలతో వైద్య విద్యలో దరఖాస్తు చేసుకున్న ఇతర రాష్ట్ర విద్యార్థులను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గుర్తించింది. వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది ప్రవేశాలు పొందగా.. వారి సీట్లను రద్దు చేసింది యూనివర్సిటీ.
చదువు, ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికెట్లను నమ్ముకొనే బ్యాచ్ గుట్టు బయటపడింది. తెలంగాణలో అధికారులకు లంచాలు ఇచ్చి మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక విద్యార్థులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఆ ధ్రువపత్రాలతో ఏకంగా రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు 37 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే.. దరఖాస్తుల పరిశీలన సమయంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్లై చేసుకున్న 37 మంది ఇతర రాష్ట్ర విద్యార్థుల్లో ఇప్పటికే 9 మంది సీట్లను కేటాయించారు. దాంతో.. ఆ తొమ్మిది మంది సీట్లను రద్దు చేస్తున్నట్టు కాళోజీ యూనివర్సిటీ ప్రకటించింది.
తెలంగాణలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన ఇతర రాష్ట్ర విద్యార్థులు
అధికారులకు లంచాలు ఇచ్చి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు పొందిన మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక విద్యార్థులు
నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న… pic.twitter.com/i14hLl3S3b
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026