Asian Games | ప్రచీ చౌదరీ కాంస్య గర్జన.. క్వార్టర్ ఫైనల్లో సింధు..!
Asian Games : ఆసియా క్రీడల ఏడో రోజు భారత బృందం అదరగొట్టింది. కబడ్డీలో రెండు స్వర్ణాలు, షాట్‌పుట్‌లో తజిందర్ సింగ్ రజతం పట్టేయగా.. మహిళల 400 మీటర్ల పరుగులోలో ప్రచీ చౌదరీ(Prachi Choudhary) కాంస్యంతో గర్జించింది.
Asian Games : ఆసియా క్రీడల ఏడో రోజు భారత బృందం అదరగొట్టింది. కబడ్డీలో రెండు స్వర్ణాలు, షాట్‌పుట్‌లో తజిందర్ సింగ్ రజతం పట్టేయగా.. మహిళల 400 మీటర్ల పరుగులోలో ప్రచీ చౌదరీ (Prachi Choudhary) కాంస్యంతో గర్జించింది. ఆసియాడ్‌లో ఆమెకు ఇదే మొదటి పతకం కాగా బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు(PV Sindhu) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొమొక మియజాకి(జపాన్)తో జరిగిన ప్రీ-క్వార్టర్స్‌లో చెలరేగిన తెలుగు తేజం అలవోకగా ముందంజ వేసింది.
నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పీవీ సింధు సత్తా చాటుతోంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సింధు మహిళల ప్రీ -క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ తొమొక మియజాకిను చిత్తు చేసింది. వరస సెట్లలో జోరు చూపించిన ఒలింపిక్ విజేత.. 21-9, 21-13తో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.
SINDHU MARCHES ON! 🏸⚡
PV Sindhu powers past Chinese Taipei’s Chiu Pin-chian in straight games (21-14, 21-14) to seal her spot in the Asian Games Round of 16! 🔥
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/WRYgMLCgBH
— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2026
అంతకుముందు.. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రచీ చౌదరీ కంచు మోత మోగించింది. ఆసియా క్రీడల్లో ఆమెకిది మొట్టమొదటి మెడల్ కావడం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో ప్రచీ 53.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా తన కలల పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక మహిళల 1,500 మీటర్ల పరుగులో అంచనాలు అందుకుంటూ పరుల్ చౌదరీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

