పాపన్నపేట, సెప్టెంబర్ 26: పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలో పల్లకి సేవ నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకొని శనివారం ఆద్యంతం కోలాహలంగా పల్లకి సేవ జరిపారు. ఈ సందర్భంగా వనదుర్గ మాత ఉత్సవ విగ్రహాన్ని అత్యంత వైభవంగా ముస్తాబు చేశారు.
పల్లకి సేవలో భాగంగా వనదుర్గ అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దుర్గామాత ఆలయం నుండి రాజగోపురం వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. పల్లకి సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
