సమర్కండ్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది. శనివారం జరిగిన కీలకమైన పదో రౌండ్ పోరులో భారత్ 3.5-0.5తో ఉజ్బెకిస్థాన్- 2 జట్టును చిత్తు చేసింది. మరో రౌండ్ మిగిలున్న టోర్నీలో 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఉజ్బెకిస్థాన్ ప్రధాన జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆదివారం జరిగే ఆఖరి రౌండ్లో భారత్.. హంగేరితో తలపడనుండగా.. ఉజ్బెకిస్థాన్ 1,2 జట్లు పోటీ పడతాయి. మహిళల పదో రౌండ్లో భారత్ 2-2తో చైనాను నిలువరించింది. ప్రస్తుతం చైనా, కజకిస్థాన్ 18, 17 పాయింట్లతో టాప్-2లో ఉండగా.. భారత్ 16 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది.