తిరువనంతపురం: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఆదివారం జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ 14-20 వన్డేలు మాత్రమే ఆడనుండటంతో ప్రతి మ్యాచ్‌నూ ఉపయోగించుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో)సన్నద్ధతతో పాటు యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించనుంది.
మరోవైపు, న్యూజిలాండ్, శ్రీలంక చేతిలో వన్డే సిరీస్‌లు ఓడిపోవడమే కాకుండా విండీస్ బోర్డు తమ కాంట్రాక్ట్ ఫీజుల్లో 25 శాతం కోత విధించడంతో కరీబియన్ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారు. మైదానంలో, వెలుపల అనేక ఆర్థిక, మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్న విండీస్ జట్టు.. భారత్‌కు ఏమేరకు పోటీ ఇస్తుందో చూడాలి.