ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కాల్వ ద్వారా నీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ వినతి
గుర్రంపోడు మండలంలోని చెరువులు, కుంటలను నింపేందుకు ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, SLBC DE/EE కు బుధవారం వినతి పత్రం అందజేశారు.
గుర్రంపోడు, సెప్టెంబర్ 02 : గుర్రంపోడు మండలంలోని చెరువులు, కుంటలను నింపేందుకు ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, SLBC DE/EE కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుర్రంపోడు మండల పరిధిలోని వ్యవసాయ పొలాలకు వర్షాభావంతో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. AMRP కెనాల్ ద్వారా మండలంలోని అన్ని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపితే రైతులకు సాగు అలాగే త్రాగు నీరు అందుతుందన్నారు. అలాగే పశువులకు కూడా నీరు అందుతుందని తెలిపారు. రెండు రోజుల్లో SLBC ద్వారా నీళ్లు విడుదల చేయకపోతే, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన పెద్ద ఎత్తున రైతులతో కలిసి అన్ని కాలువలకు దగ్గరుండి నీళ్లు విడుదల చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు జక్కల భాస్కర్, కూనూరు సైదిరెడ్డి, దోటి గణేష్, కొండ్రపల్లి గిరి, అబ్బాస్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

