MLA Sabitha Reddy | ముంపు సమస్య లేకుండా నాలా పనులు త్వరగా పూర్తిచేయాలి : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
MLA Sabitha Reddy | వచ్చే వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన నాలా పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి ఆదేశించారు.
బడంగ్‌పేట (వికారాబాద్) : వచ్చే వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన నాలా పనులు (Nala works ) పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి (MLA Sabitha Indra Reddy) ఆదేశించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మిథీలానగర్, భవాని నగర్లో ఆదివారం ఆమె పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వర్షాకాలం (Monsoon season) లో కాలనీలలో వరద నీరు నిల్వకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, ముంపు కాలనీల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకొని పరిష్కరించాలని కోరారు.
చెరువు పరిసరాలల్లో ఉన్న కాలనీలకు వర్షం నీరు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్లు అనిల్‌కుమార్ యాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, బడంగ్‌పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, నాయకులు దీప్లాల్ చౌహన్ ఉన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

