Jabardasth Pavithraa | జబర్దస్త్ కమెడియన్ కారుకు ప్రమాదం.. వీడియోను షేర్ చేసిన పవిత్ర
Jabardasth Pavithraa | జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ నెల 11న సొంతూరులో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పింది.
Jabardasth Pavithraa | జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ నెల 11న సొంతూరులో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే పొదల్లోకి దూసుకెళ్లింది. దాంతో కారు ముందు టైర్ ఊడిపోయింది. అలాగే, కారు దెబ్బతిన్నది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. సంఘటన జరిగిన సమయంలో ప్రాణాలతో బయటపడతాననే నమ్మకం లేదంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఇదిలా ఉండగా.. జబర్దస్త్ ద్వారా పవిత్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నది.
పలు టీవీ షోలతో పాటు యూట్యూబ్ ఛానల్‌తో సందడి చేస్తుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి స్వస్థలం సోమశిలకు కారులో బయలుదేరింది. ప్రమాదం జరిగిన సమయంలో పవిత్రతో పాటు కారులో బంధువులు సైతం ఉన్నారు. నెల్లూరు ఉప్పలపాడు హైవే వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు పవిత్ర కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందు టైర్ ఊడిపోయి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. సమయానికి కారులోని ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. చిన్న గాయాలతో బయటపడ్డామని చెప్పింది. పిన్ని, పిల్లలందరూ ప్రాణాలతో బయటపడ్డామని.. మళ్లీ ఘటన తలుచుకుంటేనే భయమేస్తుందని తెలిపింది. ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన కారు పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

