SRH vs PBKS : పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దంచికొడుతున్న రాహుల్ త్రిపాఠి(33)ని హర్షల్ పటేల్ వెనక్కి పంపాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ(41), తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(2)లు క్రీజులో ఉన్నారు. దాంతో, సన్‌రైజర్స్ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఇంకా సన్‌రైజర్స్ విజయానికి 131 పరుగులు కావాలి.
215 పరుగులను ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన డేంజరస్ ఓపెనర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(0) తొలి బంతికే బౌల్డయ్యాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి బంతిని డిఫెన్స్ చేయబోయిన హెడ్.. వికెట్ పారేసుకున్నాడు. అనంతరం వచ్చిన రాహుల్ త్రిపాఠి(33) బౌండరీలతో జోష్ తెచ్చాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం జోరందుకోవడంతో హైదరాబాద్ 14కు పైగా రన్‌రేటుతో రన్స్ సాధించింది.
Talk about a spectacular start!
A BEAUT of a delivery from Arshdeep Singh to get things going! ❤️💪
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvPBKS | @arshdeepsinghh | @PunjabKingsIPL pic.twitter.com/WInHujNQ8P
— IndianPremierLeague (@IPL) May 19, 2024