కౌలాలంపూర్: హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu).. మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జిహి చేతిలో ఆమె పరాజయాన్ని చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ టూ ప్లేయర్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 16-21, 15-21 స్కోరుతో సింధుపై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నది. చైనీస్ ప్లేయర్ దూకుడు ముందు సింధు తేలిపోయింది.
కాలి గాయం కావడం వల్ల గత అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్న పీవీ సింధు చాలా గ్యాప్ తర్వాత తొలి టోర్నమెంట్ ఆడింది. రెండో గేమ్‌లో 11-6 స్కోరుతో లీడింగ్‌లో ఉన్నా.. ఆ తర్వాత తన పట్టు కోల్పోయింది. సింధు ఓటమితో మలేషియా ఓపెన్ టోర్నీలో ఇండియన్ ప్లేయర్ల స్టోరీ ముగిసింది. వాస్తవానికి సింధు ఈ మ్యాచ్ ఆరంభంలో తన సామర్థ్యానికి తగినట్లు ఆడింది. హార్డ్ హిట్టింగ్ చేసింది. క్రాస్ కోర్టు స్మాష్‌లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. ఓ దశలో5-2 తేడాతో తొలి గేమ్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కానీ ఆ తర్వాత వాంగ్ ఊపందుకున్నది.
ఓ దశలో 13-13 పాయింట్లతో తీవ్ర పోటీపడ్డారు. ఇక 15-14 స్కోరు ఉన్నప్పుడు వాంగ్ తన ప్రతాపాన్ని చూపింది. సింధుపై తీవ్ర వత్తిడి తెచ్చింది. ఏకధాటిగా షాట్లతో చెలరేగింది. ఆ జోరుకు పీవీ సింధు చేతులెత్తేసింది. రెండో గేమ్ ఆరంభంలో కూడా సింధు దూకుడుగా ఆడినా.. రెండో హాఫ్‌లో వాంగ్ తన స్ట్రోక్ ప్లేతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
Soniia Cheah terangkan aspek ‘forehand’ dari permainan PV Sindhu menjadi kunci utama buat Wang Zhi Yi untuk meraih kemenangan!
Saksikan kejohanan terbuka Malaysia 2026 secara langsung di Astro, sekarang!#MalaysiaOpen2026 pic.twitter.com/1nk36v2QBo
— Astro Arena 🇲🇾 (@ASTROARENA) January 10, 2026