జమ్ముకశ్మీర్‌లోని సాంబ సెక్టార్లో పాకిస్థాన్ కుట్రను బీఎస్ఎఫ్ బలగాలు భగ్నం చేశాయి. డ్రోన్ల ద్వారా భారత్‌లోకి అక్రమంగా తరలిస్తు్న్న ఆయుధాలను పట్టుకున్నారు.
సాంబ సెక్టార్లో శుక్రవారం రాత్రి సమయంలో సరిహద్దు అవతల నుంచి డ్రోన్ల కదలికలు ఉన్నట్లు బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే ఫ్లోరా గ్రామంలో డ్రోన్ దిగిందని గమనించి, ఆ చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నది ఒడ్డున పసుపు రంగు టేప్‌తో చుట్టిన ఓ ప్యాకెట్‌ను బలగాలు గుర్తించాయి. అందులో ఆయుధాలు ఉన్నట్లు గమనించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్లో ఉన్న రెండు పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు.