వ్యవసాయ యూనివర్సిటీ,మార్చి 9: రైతు చైతన్యంతోనే పంటల సాగు అధిక దిగుబడులు సాధ్యమని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. అల్దాస్ జానయ్య తెలిపారు. సోమవారం రెండో రోజు పీజేటీఏయూ , కోరమాండల్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రధాన వ్యవసాయ వర్సిటీలో పీజేటీఏయూ ప్రధాన గుర్తింపు ఉందని , అందుకు అనుగుణంగా గత పదేండ్లల్లో దేశంలోనే వరి అత్యధిక సాగు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్నటు ్లరాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి సురేంద్రమోహన్ గుర్తు చేశారు.రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సమాచార కమిషనర్ శ్రీనివాస్, తదితరులు రైతులనుద్దేశించి మాట్లాడారు. నానో యూరియా వల్ల ఎలాంటి నష్టం లేదని, తగిన మోతాదులో వాడాలని సూచించారు. కార్యక్రమం లో కోరమండల్ సీఈవో శంకర సుబ్రహ్మణ్యం, వైస్ ప్రసిడెంట్ జీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రప్రదర్శనకు రైతులు
‘గాడి తప్పిన రైతు మేళా’ అని నమస్తే తెలంగాణకు దిన పత్రికలో వచ్చిన వార్తకు అగ్రి వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యతో పాటు ప్రధాన శాస్త్రవేత్తలు స్పందించారు. సోమ వారం రైతు మేళాలో కనీస సౌకర్యాలు క ల్పించడంతో పాటు, రైతులను శాస్త్రవేత్తలు ప్రత్యేక వాహనంలో క్షేత్ర ప్రదర్శనకు తీసు కెళ్లారు, నిన్న టి రోజు మహిళా రైతులను మండు టెండల్లో నడిపించిన అధికారులు నేడు వెంబడనే ఉండి వరి, మొక్కజొన్న, కూరగాయలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గద్వాల్, నాగర్ కర్నూల్ వంటి దూరం నుంచి వచ్చి ఇక్కడే ఉన్న పలువురు రైతులు నమస్తేకు అభి నందనలు తెలిపారు. అధి కారులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ప్రైవేటు సంస్థల ప్రతినిధులు రైతులకు వారి ఉత్పత్తుల గూర్చి వివరించారు.