Siima | సైమా 2026 నామినేషన్స్ విడుదల.. 11 విభాగాల్లో ‘మిరాయ్’ హవా
Siima | దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2026 వేడుకకు రంగం సిద్ధమైంది. 2025లో విడుదలై ప్రేక్షకులను అలరించిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సైమా అవార్డ్స్ కమిటీ అత్యధిక నామినేషన్స్ సాధించిన చిత్రాల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.
Siima | దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2026 వేడుకకు రంగం సిద్ధమైంది. 2025లో విడుదలై ప్రేక్షకులను అలరించిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సైమా అవార్డ్స్ కమిటీ అత్యధిక నామినేషన్స్ సాధించిన చిత్రాల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది సైమా నామినేషన్స్‌లో తెలుగు సినిమా ‘మిరాయ్’ సత్తా చాటింది. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోరును సైమా నామినేషన్స్‌లోనూ కొనసాగించింది. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా సైమా అవార్డ్స్ రేసులో బలంగా నిలిచింది. ఈ సినిమా 10 విభాగాల్లో నామినేషన్స్ సొంతం చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సందర్భంగా విడుదలై రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రం కూడా సైమాలో మంచి గుర్తింపు పొందింది. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా 9 నామినేషన్స్ దక్కించుకుంది. విడుదలైన తర్వాత రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
అదే విధంగా నాని నిర్మించిన కోర్ట్‌రూమ్ డ్రామా ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ నోబడీ’ కూడా 9 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. సైమా 2026 అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈసారి సైమా అవార్డ్స్‌లో ‘మిరాయ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తండేల్’, ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ నోబడీ’ చిత్రాలు ప్రధాన పోటీలో నిలవడంతో అవార్డుల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. సినీ అభిమానులు విజేతలు ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- court
- Mirai
- Nominations
- siima 2026
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

