Jagapathi Babu | “ఎవ్వరూ నా మొహం పగలగొట్టలేదు”.. ముఖంపై గాయాలపై జగపతి బాబు క్లారిటీ
Jagapathi Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, అభిమానులతో టచ్‌లో ఉండేందుకు తరచూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆసక్తికర పోస్టులు, వీడియోలు పంచుకుంటుంటారు.
Jagapathi Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, అభిమానులతో టచ్‌లో ఉండేందుకు తరచూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆసక్తికర పోస్టులు, వీడియోలు పంచుకుంటుంటారు. ముఖ్యంగా తనదైన హాస్య శైలిలో పెట్టే క్యాప్షన్లు, తనపై తానే వేసుకునే సెటైర్లు, సరదా కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా జగపతి బాబు షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈసారి ఆయన చెప్పిన వంటకం కంటే, ఆయన ముఖంపై కనిపించిన గాయాలే అభిమానుల్లో ఎక్కువ చర్చకు కారణమయ్యాయి.
ఇటీవల జగపతి బాబు తన సోషల్ మీడియా ఖాతాలో చాక్లెట్ చిప్ కుకీ తయారీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ రెసిపీని తన పెద్ద కుమార్తె నుంచి నేర్చుకున్నానని సరదాగా చెబుతూ వీడియోను ప్రారంభించారు. తనదైన స్టైల్లో నవ్వులు పంచుతూ కుకీ తయారీని వివరించారు.అయితే వీడియోలో ఆయన ముఖంపై కొన్ని గాయాల మచ్చలు కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో కామెంట్స్‌లో ఇదే ప్రశ్నలు వస్తాయని ముందే ఊహించిన జగపతి బాబు, వీడియో ప్రారంభంలోనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు.ఎవడో నా మొహం పగలగొట్టినట్లు ఉందా? ఎవరూ నా మొహం పగలగొట్టలేదు. నేనే సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను అని చిరునవ్వుతో చెప్పారు.
అయితే ఎలాంటి సర్జరీ చేయించుకున్నారు? ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. జగపతి బాబు వీడియో చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. “ఏం జరిగింది సర్?”, “ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది?”, “త్వరగా కోలుకోండి” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఆయన ఎప్పటిలాగే సరదాగా స్పందించిన తీరు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న విషయాన్నే హాస్యంగా మార్చి అభిమానుల్లో ఆందోళన తగ్గించే ప్రయత్నం చేశారని అంటున్నారు.
Malli malli cheputhunna, idhi kooda ma pedda ammayi cheppinattu copy paste cheseysa 🤪 pic.twitter.com/gVmgCQxQ6D
— Jaggu Bhai (@IamJagguBhai) July 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

