Devara Song | యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవర. పాన్ ఇండియా స్థాయిలో మూవీ తెరకెక్కుతున్నది. ఈ మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తున్నది. ఇక సీనియర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.
ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు కానుకగా దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఫియర్’ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఇందులో ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నది. అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్‌ను ఇరగదీశారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణ రాశారు. ఇదిలా ఉండగా.. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కతున్నది. దేవర తొలి భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కానున్నది.