Thammudu | హిట్టు, ఫ్లాప్‌లలో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో నితిన్(Nithiin). ఇక నితిన్ నటిస్తున్న చిత్రాల్లో ‘తమ్ముడు’ (Thammudu) ఒకటి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కాంతార ఫేం సప్తమి గౌడ (Saptami Gowda) నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే సప్తమి గౌడతో పాటు ఈ మూవీలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ లయ (Laya) ఈ సినిమాతోనే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. లయ చివరిగా టాటా బిర్లా మధ్యలో లైలా(Tata Birla Madhyalo Laila) అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక చాలా రోజుల తర్వాత నితిన్ సినిమాతో మళ్లీ తెలుగులో అడుగుపెట్టబోతుంది. ఈ చిత్రంలో నితిన్‌కు అక్కగా లయ(Laya) నటించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా కోసం నితిన్ పెద్ద సాహసం చేస్తున్నాడు. ఇక నితిన్ గత చిత్రాలకు భిన్నంగా.. చాలా క్రియేటివ్‌గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.