SRH vs PBKS | పంజాబ్ కింగ్ బ్యాటర్లు ఉతికారేస్తున్నారు .టాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన పంజాబ్ మొదట్లో ఆచితూచి ఆడిన ఓపెనర్లు అథర్వ థైడే (27), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) అనంతరం చెలరేగి ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేశారు. కాగా, ఇప్పటికే ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్..7 మ్యాచ్‌లు గెలిచి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కోల్‌కతాతో జరిగే మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోతే ఎస్ఆర్హెచ్ రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది.