సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ )/బంజారాహిల్స్ : బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఈనెల 21, 22తేదీల్లో శ్రీ నరసింహ జయంత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభూజీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీ నరసింహ చతుర్దషిగా పిలుచుకునే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందాలని సూచించారు.
ఈనెల 21న లక్ష్మీ నరసింహస్వామి విశేష అలంకార దర్శనం, హోమం, అన్నదానం, హారతి తదితర కార్యక్రమాలు, 22న కలశ మహాభిషేకం, హోమం, భూసమేత నరసింహస్వామి కల్యాణోత్సవం, కల్యాణ విందు భోజన ప్రసాదం ఉంటుందన్నారు. ఈ వేడుకల సందర్భంగా భక్తులకు ఊంజల్ సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు.