మట్టి పొరలో పుట్టిన చరిత్ర
ఈ నేలను చూసి మురిసిపోయినం బందీ అయినా నేల కోసం పోరాడిన
ఈ నేలను చూసి మురిసిపోయినం
బందీ అయినా నేల కోసం పోరాడిన
వీరులను చూసి మురిసిపోయినం
అమరులు నెత్తురద్దిన నేల
పోరాడి సాధించుకున్న
వీరుల త్యాగాల నేల
అమ్మానాన్నలు
అడుగులేసిన నేల
అన్నం పెట్టిన నేల
ఆకలి తీర్చిన నేల
సాధించుకున్న నేలను
చతికిల పడకొడుతుండ్రు
అమరుల యాదిమరుస్తుండ్రు
పోరాడిన వీరుల చరిత్ర
మట్టిలో కలిపేయచూస్తుండ్రు
మట్టి పొరలో నుంచి
పుట్టుకొచ్చిన చరిత్రలు
తుడిచేస్తే తుడుచుకుపోవడానికి
మట్టిలో రాసుకున్న అక్షరాలు కావు
మహనీయుల చరిత్ర
వీరుని చరిత్ర వీరునికే దక్కుతుంది
త్యాగధనుల చరిత్ర
త్యాగధనునికే ఉంటుంది
అమరుల చరిత్ర
అమరులకే దక్కుతుంది
ఎవ్వరు చెరిపినా
చెరగని చరిత్రలుగా మిగిలిపోతాయి
మట్టి పొరలో పుట్టిన చరిత్రలు
దేవరపాగ కృష్ణయ్య
99634 49579
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

