SRH vs PBKS : సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(66) అర్ద శతకం బాదేశాడు. పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు పడినా.. ఒత్తిడికి లోన్వకుండా దంచిన అభిషేక్ ఫిఫ్టీతో జట్టును ఆదుకున్నాడు. హర్షల్ పటేల్ ఓవర్లో బౌండరీతో యాభై బాదేశాడు.
అయితే.. శశాంక్ ఓవర్లో షాట్ ఆడిన అభిషేక్.. శివం సింగ్కు క్యాచ్ ఇచ్చాడు. డేంజరస్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(19) కూడా వీరవిహారం చేస్తున్నాడు. హైదరాబాద్ స్కోర్ 11 ఓవర్లకు 133/3. ఇంకా కమిన్స్ సేన విజయానికి 54 బంతుల్లో 81 పరుగులు కావాలి.