కాబూల్: సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లో తాజాగా కురిసిన భారీ వర్షలు, వరదల వల్ల సుమారు 50 మంది మృతిచెందారు. శనివారం అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. సెంట్రల్ ఘోర్ ప్రావిన్సు సమాచారశాఖ అధిపతి మావ్లావి అబ్దుల్ హై జయీమ్ మాట్లాడుతూ.. వర్షాల వల్ల ఎంత మంది గాయపడ్డారన్న అంశంపై క్లారిటీ లేదన్నారు. అనేక కీలకమైన రహదారులు తెగిపోయినట్లు చెప్పారు. రెండు వేల ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మరో నాలుగు వేల ఇండ్లు పాకిక్షంగా దెబ్బతిన్నాయి. సుమారు రెండు వేల షాపులు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. గత వారం వచ్చిన ఆకస్మిక వరదల్లో 315 మంది మరణించారు. మరో 1600 మంది గాయపడ్డారు.