కాంబో..కనక మహాలక్ష్మి!

నెత్తిన పాపిట బిళ్ల నాట్యం చేస్తున్నా, మెడలో హారం వేలాడుతున్నా, చేతికి గాజులు గలగలమంటున్నా, వేలికి ఉంగరం ధగధగలాడుతున్నా .. ఏదో అసంతృప్తి! డైనింగ్ టేబుల్ మీదున్న పళ్లాలు, గ్లాసులు, చెంచాలు, గిన్నెలే.. ఒకే డిజైన్‌లో కనువిందు చేస్తున్నప్పుడు, ఒంటి మీది నగలు మాత్రం తలొక నమూనాలో ఎందుకు ఉండాలి? ఈ ప్రశ్నకు జవాబు.. ‘కాంబో జువెలరీ’!
మ్యాచింగ్ ఇష్టపడని మగువలు ఉండరు. పాపిట బిళ్ల నుంచి పట్టీల వరకూ అన్నీ చీరకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటారు. నగల్లోనూ మ్యాచింగ్ అనేది నయా ట్రెండ్. ఒకే థీమ్‌తో తయారైన గాజులు, నెక్లెస్, లోలాకులు ధరించాలని ఉబలాటపడుతున్నారు వనితలు. షోరూమ్‌కు వచ్చిన కస్టమర్లు మ్యాచింగ్ కోసం వెతుక్కునే పనిలేకుండా, ఆభరణాల తయారీ సంస్థలు ప్రత్యేక ‘కాంబో జువెలరీ’ని అందిస్తున్నాయి. ఉంగరాలు, వాచీలు, వడ్డాణం కూడా మ్యాచింగ్ సెట్ల జాబితాలో చేరిపోతున్నాయి.
పెండ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్లు, పార్టీలు.. ఇలా సందర్భాన్నిబట్టి ధరించే దుస్తులే కాదు, వేసుకునే ఆభరణాలూ మారిపోతాయి. సంప్రదాయ దుస్తుల మీద భారీ నగలు నిండుదనాన్ని ప్రసాదిస్తాయి. వెస్ట్రన్ వేర్‌పై సన్నటి నగలు ైస్టెలిష్ లుక్ ఇస్తాయి. వివాహాల వంటి ప్రత్యేక సందర్భాల్లో గుత్తపూసల హారాలు, కాసులపేరు, మామిడి పిందెల హారం, స్టెప్చైన్, లాంగ్ చైన్.. ఇలా నగలను వివిధ వరుసల్లో, వేరువేరు సైజుల్లో ఎంచుకుంటారు. జుంకీలు,చెంప సరాలు, మాటీలు, పాపిట బిళ్ల, జడ పిన్ను, జడ కుచ్చులు, బంగారు జడ, వడ్డాణం, వంకీ, పట్టీలు.. ఇలా ప్రతీది పెద్దనగకు మ్యాచ్ అయ్యేలా చేయించుకొంటున్నారు. కాకపోతే ఇది ఖరీదైన వ్యవహారమే. ఆ పరిమితిని అధిగమించడానికి ఇమిటేషన్ జువెలరీ సిద్ధంగా ఉంది. చవకే అయినా, చమక్కులో తేడా ఉండదు. ఉత్తరాది పెండ్లికూతుళ్లు అయితే, లెహంగాకు మ్యాచ్ అయ్యే ఆభరణాలనే కొంటున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

