Jail Imprisonment | వరంగల్ లీగల్ : అప్పటికే పెళ్లయిన నిందితుడు తాను అవివాహితుడంటూ నమ్మించి ఓ యువతి (బాధిత యువతి)ని ప్రేమిస్తున్నానని , పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి.. ఆమెను శారీరకంగా అనుభవించాడు. అంతేకాక సదరు యువతి ఆస్తులు ఆభరణాలు సుమారు రూ.90 లక్షలు కాజేసిన నిందితునికి 10 సంవత్సరాలు జైలు శిక్ష 55 వేల జరిమానాతోపాటు నిందితుని తండ్రికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జ్ జి. ప్రేమలత గురువారం సంచలన తీర్పు వెలువరించారు.
కేసు పూర్వపరాల్లోకి వెళితే.. వరంగల్ నగరంలోని గణేష్ నగర్‌కు చెందిన సూరిశెట్టి హరిత అనే బాధిత మహిళ హనుమకొండకు వచ్చిన సందర్భంలో 2017 సంవత్సరంలో వరంగల్ నగరం ఎల్లంబజార్‌కు చెందిన ఆకుతోట శిరీష్ పరిచయమయ్యాడు. యువతి ఫోన్ నెంబర్ సేకరించి తాను అవివాహితుడిని అని, తాను ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడి కూడా చేశాడు.
పెళ్లై సంతానం కూడా ఉన్న నిందితుడు..
పైగా మన భవిష్యత్తు బాగుంటుంది మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని నమ్మించి సదరు యువతికి తన కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులను నగదును క్రెడిట్ కార్డులను వాడుకొని సుమారు రూ.90 లక్షల నష్టం చేశాడు. కొద్ది రోజుల్లోనే యువతి తనకు జరిగిన మోసాన్ని గ్రహించి పెళ్లై సంతానం కూడా ఉన్న నిందితుడు శిరీష్ ను నిలదీసింది. తాను అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తినని తనకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన సదరు యువతిని తండ్రి ఆకుతోట సుధాకర్ అలియాస్ SSS సుధాకర్ బెదిరించాడు.
గత్యంతరం లేక సదరు యువతి 07-09-2021రోజున మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో నిందితునిపై ఫిర్యాదు చేయగా.. భారతీయ శిక్షాస్మృతిలోని 417, 420, 376 తో పాటు 506 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన సాక్షాదారులతో అప్పటి సీఐ మస్క శ్రీనివాస్ చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో బాధితురాలు పక్షాన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బృందాదేవి వాదించగా.. లైసెన్ ఆఫీసర్ దేవరకొండ వెంకటేశ్వర్లు కోర్టు డ్యూటీ పోలీస్ ఆఫీసర్ దౌడు ప్రతాప్ చిన్నగారి రాజులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.
తగుసాక్షాదారులతో నేరం రుజువైందని భావించిన న్యాయమూర్తి ప్రేమలత నిందితునికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు 55 వేల జరిమానాతో పేస్టు నిందితుని తండ్రి సుధాకర్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. లగ్నపత్రిక వేడుక ఫోటోలు వైరల్!
INCA 2026 | ఉత్తమ నటుడిగా నాగ చైతన్య… రష్మికకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు