విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు చక్కటి వేదిక
ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ కోర్సులో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే అనుమానాల నివృత్తికి ‘టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్2024’ చక్కటి వేదికగా నిలుస్తున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
- అమీర్‌పేట్‌లో ‘టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2024’ప్రారంభం
50కి పైగా స్టాళ్లు ఏర్పాటు
తరలివచ్చిన విద్యార్థులు,తల్లిదండ్రులు
అమీర్‌పేట్, జూన్ 1: ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ కోర్సులో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే అనుమానాల నివృత్తికి ‘టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్2024’ చక్కటి వేదికగా నిలుస్తున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇంజినీరింగ్, వైద్య కోర్సులతోపాటు విశాలమైన ఉపాధి అవకాశాలున్న ఇతర కోర్సులకు సంబంధించి పూర్తి సమాచారం ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో అందుబాటులో ఉండటం తమకెంతో అనుకూలంగా ఉన్నదని చెప్తున్నారు. శనివారం అమీర్‌పేట్ కమ్మసంఘం హాల్లో ‘టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2024’ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రారంభించారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాక దేశ నలుమూలలకు చెందిన ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, పలు వర్శిటీలు, విదేశాల్లో వైద్య వృత్తిని చేపట్టాలనుకొనే విద్యార్థుల సౌకర్యార్థం ఓవర్సీస్ సంస్థలు కూడా ఈ ఫెయిర్‌లో తమ స్టాళ్లను నెలకొల్పాయి. ఇంజినీరింగ్‌లో ఏ కోర్సులు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎలా ఉన్నాయి, ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో కాలేజీల ఎంపికలో తలెత్తే అయోమయం వంటి అంశాలపై ఈ ఫెయిర్‌లో విద్యారంగ నిపుణులు విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
పదకొండేండ్లుగా..
ఏటా జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్ పట్ల విద్యార్థుల్లో చక్కటి అంచనాలున్నాయని టీ న్యూస్ సీజీఎం ఉపేందర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేశ్, డీజీఎం కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఇక్కడ కొలువుదీరిన స్టాళ్లను పరిచయం చేస్తూ.. విద్యార్థులకు ఎటువంటి సమాచారం ఇక్కడ అందుబాటులో ఉన్నదనే విషయాన్ని వివరించారు. గత 11 ఏండ్లుగా టీ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ల పట్ల విద్యార్థులకు ప్రత్యేక ఆసక్తి నెలకొన్నదని పేర్కొన్నారు. ఈ శిబిరంలో తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్ల నుంచి పలు వర్సిటీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు.
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు
ఈ ఫెయిర్‌లో మర్రి లక్ష్మణ్‌రెడ్డి, విజ్ఞాన్స్, గీతాంజలి, నారాయణ, శ్రీ చైతన్య, గురునానక్, స్టాన్లీ, ఇక్ఫాయ్, శారద, అవంతి, సెయింట్ పీటర్స్, బ్రిలియంట్, శ్రీ దత్తా, మల్లారెడ్డి, మెథడిస్ట్, గీతమ్, వర్ధమాన్, మాస్ట్రో డైనమిక్స్ వంటి 50కి పైగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు చెందిన స్టాళ్లు ఇక్కడ కొలువుదీరాయి. ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, లా, ఓవర్సీస్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వివరాలను ఒకే వేదిక కింద తెలుసుకొనే చక్కటి అవకాశాన్ని ఈ ఫెయిర్ ద్వారా కల్పిస్తుండటం ఆనందంగా ఉన్నదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పేర్కొన్నారు.
చక్కటి మార్గదర్శకం
నాకు అవసరమైన ఎంబీఏ సీటు ఏ సంస్థలో తీసుకొంటే బాగుంటుంది.. టీచింగ్ ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంది.. ఫీజులు అందుబాటులో ఉన్నాయా.. క్యాంపస్ ఎలా ఉంది.. ప్లేస్మెంట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి.. నేను ఉంటున్న ప్రాంతం నుంచి ఏ కళాశాల ఎంత దూరంలో ఉంది.. అక్కడికి వెళ్లేందుకు నాకు ఉన్న సౌకర్యాలు ఏమిటి.. అలుమ్ని నెట్వర్క్ ఎలా ఉందనే అంశాలన్నింటిని ఒకే వేదిక వద్ద తెలుసుకునేందుకు టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నాకెంతో ఉపయోగ పడింది. మంచి కళాశాలల ఎంపికకు నాలాంటి విద్యార్థులకు చక్కటి మార్గదర్శకంగా నిలిచింది. – అక్షర, విద్యార్థిని, మేడికొండ
ఏకకాలంలోనే అన్ని సంస్థల సమాచారం
టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకొంటున్నారు. విద్యార్థులు తమ అవసరాలను తెలుసుకొనేందుకు ఒక్కో కళాశాల, వర్శిటీలకు వెళ్లి సమాచారాన్ని సేకరించడం కంటే ఇటువంటి ఫెయిర్ల ద్వారా ఏకకాలంలో అన్ని సంస్థలకు చెందిన సమాచారాన్ని తెలుసుకొనే వీలు కలుగుతుంది. జేబీఐఈటీలోని ఇంజినీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్, లా, ఫార్మసీ వంటి అన్ని కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఫెయిర్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాం. విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నది.
– డాక్టర్ పీసీ కృష్ణమాచారి,ప్రిన్సిపాల్ జేబీఐఈటీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

