ఏం అవ్వా గుర్తు పట్టినవా..?
నువ్వేమన్నా మాకు నెలనెలా
పింఛన్ ఇచ్చే మా కేసీఆర్ వా..
లేకపోతే ఊకె పలకరిచ్చే హరీశ్రావ్వా.. కేటీఆర్వా?
గుర్తుపట్టనీకి…
ఏందో చెప్పు
ఏం లేదవ్వ..
ఏమోయ్ పీఏ
ఈడ వర్కవుట్ కాదుగానీ
ఇంకో ఇంటికి పోదాం పా
ఏం తాత.. మంచిగున్నవా?
నన్ను గుర్తుపట్టినవా?
ఆ ఎందుకు గుర్తుపట్టలే
మొన్ననే కంటివెలుగుల
చూయించుకున్న… బందవస్తు
అద్దాలిచ్చిన్రు..
కండ్లు తేట్గనే కనవడ్తున్నయ్
నువ్వు గా పతిపక్షపోడివి గదా?!
అవునే…
ఏంది చానా దినాలకు గిటచ్చినవ్..
ఏం లేదే…
ఈడగూడ మన కతల్ నడ్వయ్…
ఇంకో చోటుకు పోదాం పా పీఏ..
ఏం దేవక్క ఇంకా బీడీలు
చేస్తనే ఉన్నవా?
అయ్యో ఇంట్లకు ఎట్ల ఎల్తున్నది?
ఆ.. నాకేమైంది.. నెలనెలా
కేసీఆర్ సార్ 2వేల పింఛన్ ఇత్తుండు..
అప్పుడప్పుడు టైంపాస్‌కు బీడీలు చుడితే
ఓ వెయ్యి అత్తున్నయ్
ముందటి కంటే బాగనే ఉన్నగానీ
ఏంది మస్తొద్దులకు కనిపించిన్రు…
ఏం ముచ్చట…
ఏం లేదు దేవక్కా…
పీఏ ఇక్కడ కూడ మన చాట్ల తౌడేగానీ
ఇంకొకరిని పలుకరిద్దాం పా…
ఏం ఎల్లన్నా ఎవుసం ఎట్లున్నదే…
ఏందో నారాజ్ గున్నవ్…
ఏయ్ నేనెందుకు నారాజ్గున్ననే
మొన్ననే రుణమాఫీ అయ్యింది
పెట్టుబడి అచ్చింది…
ఫుల్లుగ నీళ్లు, కరంటు ఉండనే ఉండె
వడ్లు పుట్లకు పుట్లు
పండుతనే ఉండె…
ఇంక నారాజ్గ ఎందుకుంటనే…
నువ్వేంది బగ్గ రోజులకూ…
ఏం లేదు ఎల్లన్నా…
పీఏ.. ఇగపా
ఇంకొకర్ని తగులుకుందాం…
సార్ ఒక మాట చెప్తా ఏమనుకోరుగదా
చెప్పు పీఏ.. నువ్వు నా నమ్మిన బంటువు
సార్.. మీరు ఈ ఊరేగాదు
రాష్ట్రంల ఏ ఊరు పోయినా..
ఏ ఇంటికి పోయినా మీకు
గిసోంటి సుర్కులే తగుల్తయ్
హనుమాన్ గుడి లేని ఊరు లేదు
కేసీఆర్ పథకాలు అందని ఇల్లులేదు
-రాజు అతికం 94400 12834