పారదర్శకంగా భూముల అమ్మకాలు : మంత్రి హరీష్ రావు
మంత్రి హరీష్ రావు | భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీలు అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. లింగంపల్లిలో

సంగారెడ్డి : భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీలు అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భూముల అమ్మకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. దీంతో సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు నిరర్ధక ఆస్తులు అమ్ముతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పాము. పూర్తి పారదర్శకంగా భూములు అమ్మటం జరుగుతుంది అని మంత్రి స్పష్టం చేశారు.
భూముల అమ్మకాన్ని కావాలని రాద్ధాంతం, రాజకీయ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ తన 10 ఏండ్ల పాలనలో 88,500 ఎకరాల భూములు అమ్మారు. తెలంగాణలోని విలువైన భూములు అమ్మి ఆంధ్రాలో ఖర్చు చేశారు. నాడు భట్టి విక్రమార్క ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడేమో కావాలని రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంతో పాటు 24 సంస్థల నుంచి 45 సార్లు వాటాలను విక్రయించింది. పెట్టుబడుల ఉపసంహరణ చేస్తే ప్రోత్సహకాలు, ప్రైజ్‌లు ఇస్తామని రాష్ట్రాలకు లేఖ రాసింది.. ఆ లేఖను విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

