Harish Rao | ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు దుష్ర్పచారం : హరీశ్‌రావు
Harish Rao | ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు.
Harish Rao | హైదరాబాద్ : ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు. తన ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన సదరు మీడియా సంస్థకు రిజాయిండర్ పంపించి, వార్తను సరిచేయించడం జరిగింది. అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తూ వస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తాను. ఎల్లపుడూ ఉద్యోగుల హక్కులకోసం అండగా నిలిచే నా పై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని హరీశ్‌రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఈ సందర్భంగా తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఉద్యోగులకు సంబంధించి నాలుగు కరువు భత్యాలు విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. పీఆర్సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన సదరు మీడియా సంస్థకు రిజాయిండర్ పంపించి, వార్తను సరిచేయించడం జరిగింది. అయినా…
— Harish Rao Thanneeru (@BRSHarish) March 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

