చిట్టి కథ
ఇల్లంతా.. మాటలు. నిశ్శబ్దం కావాలనిపించేది. ఇల్లంతా.. నిశ్శబ్దం. మాటలు కావాలనిపిస్తుంది.
ఆశ
ఇల్లంతా..
మాటలు.
నిశ్శబ్దం
కావాలనిపించేది.
ఇల్లంతా..
నిశ్శబ్దం.
మాటలు
కావాలనిపిస్తుంది.
(పిల్లలు ఎగిరిపోయిన
ఓ ముసలి పెన్షనర్ ఆశ)

అన్నయ్య
రెండు చాక్లెట్లు.
ఒకటి తనకు..
ఒకటి తమ్ముడికి.
రెండు కిడ్నీలు.
ఒకటి తనకు.
ఒకటి తమ్ముడికి.
అన్నయ్య..
అస్సలు మారలేదు.

ప్రిస్క్రిప్షన్
‘మీరు డిప్రెషన్లో ఉన్నారు.
మంచి కౌన్సెలర్‌ను కలవండి’
సలహా ఇచ్చాడు డాక్టర్.
వెంటనే ఫోన్ చేశాను..
స్నేహితుడికి.

ఎర్రచీర
‘నా ఎర్రచీర ఏమైంది?’
‘లిప్‌స్టిక్ ఇక్కడే ఉండాలే?’
‘ఐ లైనర్ ఎవరు తీశారు?’
భర్తకు కాల్ చేసింది.
‘పార్ట్‌టైమ్ జాబ్‌లో బిజీ’
అంటూ కట్ చేశాడు.
ఖైరతాబాద్ చౌరస్తాలో
ఆమె ప్రశ్నకు
జవాబు దొరికింది.

పాత పుస్తకం
ఫుట్‌పాత్ మీద
పాత పుస్తకం కొన్నాను.
అక్షరాలు
ఒక కథ చెబితే.
అండర్లైన్లు
ఇంకో కథ చెప్పాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

