The Cumin Club | అమ్మ చేతి వంటను మిస్సవుతున్నారా? ఇక బెంగ పడనక్కర్లేదట !!
The Cumin Club | చదువులు, ఉద్యోగాల కోసం.. ఉన్న ఊరిని, కన్నతల్లిని, అమ్మచేతి వంటనూ వదిలి నగరాలకు, విదేశాలకు వెళ్లక తప్పదు. అయితే అక్కడి వంటలు నచ్చకపోతే? పదేపదే అమ్మచేతి వంట గుర్తొస్తే? ‘ఏం బెంగ పడనక్కర్లేదు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే తెచ్చి మీ చేతికందిస్తాం. ఐదు నిమిషాలు శ్రమపడితే కమ్మని అమ్మచేతి రుచుల్ని ఆస్వాదించవచ్చు’ అంటున్నారు ‘ద క్యుమిన్ క్లబ్(The Cumin Club)’ వ్యవస్థాపకులు రాగోత్ బాల.

అమ్మచేతి వంటనే యూఎస్పీగా తీసుకుని అమెరికాలో రుచుల సామ్రాజ్యం స్థాపించారు బాల. కోయంబత్తూరుకు చెందిన బాల అమెరికాలో మన రుచులను రెడీ టు కుక్ కిట్స్ రూపంలో అందిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ను మధ్యలో వదిలేసి హోటల్ మేనేజ్మెంట్పై ఇష్టంతో ఆతిథ్య వ్యాపారంలోకి వచ్చారు. ‘ఇంజినీరింగ్ చదువుతున్నపుడు అమ్మచేతి వంట బాగా మిస్సయ్యేవాణ్ని. దీంతో అమ్మ రెడీ టు కుక్ ప్యాకెట్ల రూపంలో ఆహార పదార్థాలు పంపేది. అలా ఏడాది మొత్తం అమ్మ పంపిన ప్యాకెట్లనే వండుకుని తిన్నా. ఆ ఆలోచనతోనే ఈ స్టార్టప్‌ను ప్రారంభించా. అమెరికాలో చాలామంది మన రుచులను మిస్సవుతున్నారు. ఇక్కడి తిండి తినలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, సహజసిద్ధమైన పద్ధతుల్లో రెడీ టు కుక్ కిట్స్‌ను తయారు చేసి అమ్మచేతి వంట రుచి చూపిస్తున్నాం’ అంటారు బాల. 2019లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నలభై వేల మంది సబ్‌స్ర్కైబర్స్‌తో మూడు మిలియన్ డాలర్ల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తున్నది. దాల్ మఖనీ, పావ్ బాజీ వంటి ఉత్తరాది వంటలతోపాటు రైస్ ఉప్మా, ఇడ్లీ సాంబార్ వంటి దక్షిణాది రుచులనూ అందిస్తున్నారాయన.

Read More :
అమ్మ కోసమే ఐఏఎస్.. ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిచ్చే నిజామాబాద్ అమ్మాయి కథ”
“వీళ్లు వంట చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Food
- inspiration
- Nri
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

