67. గుప్తుల కాలంలో భూములు, వాటి వివరణల్లో సరికానిది?
1) క్షేత్రం- అన్ని రకాల పంటలు పండేవి
2) ఖిల- పచ్చిక బయళ్లు
3) వస్తి- నివాసయోగ్యమైన భూమి
4) అప్రహత- అటవీ భూములు
68. గుప్తుల పాలనలోని పన్నులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) భోగ- గ్రామస్తులు పండ్లు వంట చెరుకు రూపంలో చెల్లించే పన్ను
2) కర- న్యాయబుద్ధి గల రాజులు చెల్లించే ప్రత్యేక పన్ను
3) హిరణ్య- బంగారు నాణేల రూపంలో చెల్లించే భూమి శిస్తు
4) శుల్క- పోలీస్ పన్ను
69. గుప్తుల కాలం నాటి గ్రంథాలకు సంబంధించిన వివరణల్లో సరికానిది?
1) మాళవికాగ్నిమిత్రం- అగ్రిమిత్రుడు, మాళవికల ప్రణయ వృత్తాంతం
2) విక్రమోర్వశీయం- ఉర్వశి, పురూరవుడికి మధ్యగల ప్రేమ వృత్తాంతం
3) రఘువంశం- శకుంతల, దుష్యంత చక్రవర్తుల సమాగమ వృత్తాంతం
4) కుమార సంభవం- శివపార్వతుల ప్రణయ వృత్తాంతం
70. కింది వాటిలో అజంతాలోని 16వ గుహలో లేని చిత్రం?
1) గౌతముని జన్మ జాతక పరీక్ష
2) గౌతముని జాతక కథలు
3) గౌతముని విద్యాభ్యాసం
4) గౌతముని పురవీధి విహారం
71. కింది వాటిలో సరికానిది?
1) అజంతా చిత్రాల్లో తలమానికమైన చిత్రం మరణాసన్న రాకుమారి చిత్రం
2) అజంతా చిత్రాలకు అనుకరణలు బాగ్ చిత్రాలు
3) విష్ణు ధర్మోత్తర పురాణం- గుప్తుల కాలం నాటి చిత్రకళను గురించి వర్ణిస్తుంది
4) అలంగ్రంగయాన సూత్ర- గుప్తుల కాలం నాటి సంగీత పద్ధతిని వర్ణిస్తుంది
72. కింది వాటిలో సరికాని వాక్యం?
1) కుమారగుప్తుని పాలనా కాలం క్రీ.శ. 420-455
2) శివుని రూపంలో వీణ వాయిస్తున్నట్లుగా నాణాలను ముద్రించింది సముద్రగుప్తుడు
3) రామాయణం, మహాభారతం వంటి పురాణాలు రెండో చంద్రగుప్తుని కాలంలో రంచించారు
4) సాహిత్యపరంగా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమని పేర్కొంటారు
73. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది కుమారగుప్తుడు
2) ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియాగా నలంద విశ్వ విద్యాలయాన్ని పేర్కొంటారు
3) రెండో చంద్రగుప్తుడు, ధ్రువాదేవీల కుమారుడు స్కందగుప్తుడు
4) క్రీ.శ. 405లో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్
74. కింది వాటిలో సరికానిది?
1) బుధ గుప్తుడికి సంబంధించిన శాసనం నలంద తామ్ర శాసనం
2) అశ్వమేధ యాగం చిహ్నంతో నాణాలు ముద్రించింది కుమారగుప్తుడు
3) మత్స్య, వాయు, విష్ణు పురాణాలు సాహిత్య ఆధారాలతో గుప్త వంశావళిని వివరిస్తాయి
4) గుప్త వంశ క్రమాన్ని వివరించే మరొక గ్రంథం కలియుగ రాజు వృత్తాంతం
75. కింది వాటిలో సరికాని వాక్యం?
1) మొదటి చంద్రగుప్తుడు రాజకీయంగా లాభపడటానికి కారణం లిచ్ఛవులతో వివాహ సంబంధాలను ఏర్పర్చుకోవడం
2) గుప్తుల యుగంలో రాజరికం వారసత్వంగా ఉంది
3) గుప్తుల కాలంలో మంత్రిమండలిలోని సభ్యులను వారసత్వంగా నియమించేవారు
4) గుప్తుల కాలంలో విదేశీ వ్యవహారాలను నిర్వహించే ఉద్యోగి మహా దండ నాయకుడు
76. గుప్తుల కాలానికి సంబంధించి సరికానిది?
1) ఆర్యభట్ట ఆర్యభట్టీయం, సూర్యసిద్ధాంతం వంటి ఖగోళ గ్రంథాలను రచించాడు
2) గుప్త యుగానికి చెందిన మరొక ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు శుస్రుతుడు
3) గుప్తయుగం నాటి ప్రసిద్ధ వైద్యశాస్త్ర నిపుణుడు వాగ్భటుడు రచించిన వైద్యశాస్త్ర అంశాలను వివరించే గ్రంథం అష్టాంగ సంగ్రహం
4) దేవాలయాలను నిర్మించే సంప్రదాయం ఉత్తర భారతదేశంలో ప్రారంభించినవారు గుప్తులు
77. కింది వాటిలో సరికాని వాక్యం?
1) శుల్క- వర్తకుని పన్ను/రేవు పట్టణాలపై పన్ను
2) గుప్తుల కాలంలో లకులు, యవనులను ‘మ్లేచ్ఛులు’గా పేర్కొనేవారు
3) అరిగట్ట- ఉత్తర భారతదేశంలో నీటిపారుదల వసతి
4) కుల్యవాన- దక్షిణ భారతదేశంలో చెరువు ద్వారా నీటి పారుదల
78. కింది వాటిలో సరికానిది?
1) విజ్ఞానేశ్వరుడు- మితాక్షరం (యాజ్ఞవల్క్యుని ధర్మశాస్త్రంపై వ్యాఖ్య)
2) జీమూత వాహన- దయభాగ
3) మెరుటుంగా- ప్రబంధ చింతామణి
4) పుగలేంది…..- పద్మమంజరి
79. కింది వాటిలో సరికాని వాక్యం?
1) నారదస్మృతి, బృహస్పతి స్మృతులు గుప్తుల పాలనకు ఆధారాలు
2) న్యాయశాస్త్ర గ్రంథాలు మనుస్మృతి, నారదస్మృతి, పరాశర స్మృతి, కాత్యాయన ధర్మసూత్రాలు
3) గుప్త సమాజంలో అంటరానితనం ఉన్నట్లు ఫాహియాన్ రచనల ద్వారా తెలుస్తుంది
4) గుప్త సామ్రాజ్యం పాలనా సౌలభ్యం కోసం విషయాలుగా విభజించారు
80. నరసింహ బాలాదిత్యకు సంబంధించి సరికాని వాక్యం?
1) గుప్తుల్లో చివరి చక్రవర్తి
2) హ్యుయాన్‌త్సాంగ్ ప్రకారం ఇతను బౌద్ధమతాన్ని స్వీకరించాడు
3) ఒరిస్సాలోని రత్నగిరిలో మహావిహారాన్ని నిర్మించాడు
4) హుణుల నాయకులైన మిహిరకులను ఓడించి విడిచిపెట్టాడు గుప్తానంతర యుగం
81. హ్యుయాన్‌త్సాంగ్ కింది ఏ రాజుల రాజ్యాలను సందర్శించాడు?
ఎ. హర్షవర్ధనుడు బి. నరసింహవర్మ-1
సి. మహేంద్రవర్మ-1 డి. పులకేశి-2
ఇ. విక్రమాదిత్య-1
1) ఎ, డి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ
82. కింది వాటిని జతపర్చండి?
ఎ. మౌఖరి 1. ప్రాక్జ్యోతిష్యపురం
బి. పుష్యభూతి 2. కనోజ్
సి. మైత్రేక 3. స్థానేశ్వర్
డి. కామరూప 4. వల్లభి
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
83. కింది వాటిలో సరికాని వాక్యం?
1) ఆండాళ్ ఒక తమిళ వైష్ణవ సన్యాసి
2) కరైక్కళ్ ఒక తమిళ శైవ సన్యాసి
3) ఐహోల్ శాసనంలో సకలోత్తరపీదేశ్వర…. అని కీర్తిగాంచింది హర్షవర్ధనుడు
4) అర్జునుడి తపస్సు శిల్పం/గంగావతరణ శిల్పం తంజావూరులో ఉంది
84. ‘సేతుబంధు’ అనే ప్రాకృత కావ్యాన్ని రచంచిన ప్రవరసేన-2 ఏ వంశానికి చెందిన రాజు
1) వాకాటక వంశం
2) బాదామి చాళుక్య వంశం
3) అభిర వంశం 4) పల్లవ వంశం
85. హర్షుడు ప్రయాగలో ఐదేండ్లకోసారి నిర్వహించే మహామోక్ష పరిషత్ కార్యక్రమం ఏది?
1) మోక్షం కోసం మహాయజ్ఞం చేయడం
2) మోక్షం కోసం బలి ఇవ్వడం
3) మోక్షం కోసం ఉపవాస దీక్షలు చేపట్టడం
4) మోక్షం కోసం దానధర్మాలు చేయడం
86. పల్లవుల్లో వైష్ణవ మతాన్ని స్వీకరించినవారు?
ఎ. మహేంద్రవర్మ-1 బి. నరసింహవర్మ-1
సి. సింహవిష్ణు డి. నందివర్మ-2
ఇ. నరసింహ వర్మ-2
1) ఎ 2) ఎ, డి
3) సి, డి 4) ఎ, సి, డి
87. కింది వాటిలో సరైన జత కానిదేది?
1) పుల్లలూరు యుద్ధం- మహేంద్ర వర్మ-1
2) మణిమంగళ యుద్ధం- నరసింహ వర్మ-1
3) ద్రావిడ శైలి ఆలయ నిర్మాణ ఆరంభం- నరసింహ వర్మ-2
4) ఉగ్రోదయ వజ్రం- నందివర్మ-1
88. కింది వాటిని జతపర్చండి?
ఎ. నవనందీశ్వర ఆలయం 1. ఐహోల్
బి. నవబ్రహ్మేశ్వర ఆలయం 2. బాదామి
సి. దుర్గ ఆలయం 3. నంద్యాల
డి. గుహాలయాలు 4. అలంపూర్
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
89. భారతదేశాన్ని సందర్శించిన కింది చైనీయులను వరుసక్రమంలో అమర్చిన సరైన ఐచ్ఛికాన్ని గుర్తించండి?
ఎ. హ్యుయాన్‌త్సాంగ్ బి. ఇత్సింగ్
సి. ఫాహియాన్ డి. వ్యాంగ్-యువాన్-త్సె
1) సి, డి, ఎ, బి 2) సి, ఎ, డి, బి
3) ఎ, డి, సి, బి 4) ఎ, సి, బి, డి
90. కింది వాటిని జతపర్చండి?
ఎ. పరశురామేశ్వర ఆలయం
1. మహాబలిపురం
బి. వైకుంఠ పెరుమాళ్ 2. గుడిమల్లం
సి. తీర దేవాలయం 3. ఉండవల్లి
డి. అనంతశయనస్వామి ఆలయం
4. కంచి
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-2, బి-4, సి-3, డి-1
91. కింది వాటిలో ఏవి సరిగా జతపరిచి ఉన్నాయి?
ఎ. మృచ్ఛకటికం- శూద్రక
బి. బుద్ధ చరిత- వాసుబండ
సి. ముద్రారాక్షసం- విశాఖదత్త
డి. హర్షచరిత- బానభట్ట
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, డి 4) బి, సి
92. కింది వాటిని జతపర్చండి?
ఎ. అశ్వఘోషుడు 1. ముద్రారాక్షసం
బి. బాణుడు 2. శౌరిపుత్ర ప్రకరణం
సి. కాళిదాసు 3. కాదంబరి
డి. విశాఖదత్తుడు 4. మాళవికాగ్నిమిత్రం
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
93. కింది వాటిలో సరికాని వాక్యం?
1) అలంపూర్‌ను దేవాలయ నగరం (Temple of Town) అని పిలుస్తారు
2) అలంపూర్ తుంగభద్రా నది బడ్డున ఉంది
3) యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించిన ఎలిఫెంట దీవిలోని త్రిమూర్తి దేవాలయం మహారాష్ట్రలో ఉంది
4) పశువైద్యంపై హస్తాయుర్వేదం అనే గ్రంథాన్ని రాసింది పలకవ్య…..
94. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు
2) హర్షవర్ధనుడి తండ్రి పేరు ప్రభాక వర్ధనుడు
3) రాజశ్రీని వివాహం చేసుకున్న కనోజ్ పాలకుడు గృహవర్మన్
4) గౌడ శశాంకుని సహాయంతో కనోజ్‌పై దాడిచేసి గృహవర్మను హతమార్చింది స్కందగుప్తుడు
95. కింది వాటిలో సరికాని వాక్యం?
1) క్రీ.శ. 606లో రాజయ్యే నాటికి హర్షుని వయస్సు 13 ఏండ్లు
2) హర్షుని బిరుదులు 3వ అశోకుడు, శీలాదిత్య
3) హర్షుని రచనలు ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి
4) హర్షుని ఆస్థాన కవి, చరిత్రకారుడు బాణభట్టుడు
96. కింది వాటిలో సరికానిది?
1) హర్షుని ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్
2) హ్యుయాన్‌త్సాంగ్ రచించిన గ్రంథం సి-యు-కి
3) పార్వతీ పరిణయం అనే పుస్తకాన్ని రచించింది దివరపతి
4) హర్షుడిని ఓడించిన బాదామి చాళుక్య రాజు రెండో పులకేశి
97. కింది వాటిలో సరికాని వాక్యం?
1) ప్రభాక వర్ధనుడి రాణి యశోమతి
2) ప్రభాక వర్ధనుడి బిరుదు హుణ హరిణ కేసరి
3) రెండో పులకేశి హర్షుడిని పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు
4) రెండో పులకేశి హర్షుడిని ఓడించినట్లు తెలిపే ఆధారం ఐహోల్ శాసనం
98. హర్షుడి పాలనకు సంబంధించి సరికానిది?
1) ఇతడి కాలంలో విదేశీ వ్యవహారాల మంత్రి మహాసంధి విగ్రహాధికృత
2) దేశీయ వ్యవహారాల మంత్రి మహాకార్యకుడు
3) ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి దివరపతి
4) ఇతడి పాలనా విధానం గుప్తుల పాలనను పోలి ఉంటుంది
99. కింది వాటిలో సరికాని వాక్యం?
1) హర్షుడి కాలంలో భూమిశిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది
2) పుష్యభూతి వంశస్తుల ఆరాధ్య దైవం శివుడు
3) హర్షుడు తొలుత మహా శివుని భక్తుడు
4) హ్యుయాన్‌త్సాంగ్ ప్రోత్సాహంతో హర్షుడు అవలంబించిన మతం హీనయాన బౌద్ధం
100. కింది వాటిలో సరికానిది?
1) హర్షుడి తర్వాత కనోజ్ పాలకుడు అర్జునుడు
2) కనోజ్‌ను పాలించిన చివరి గొప్ప పాలకుడు భవభూతి
3) మాలతీ మాధవన్ అనే పుస్తకాన్ని రాసింది భవభూతి
4) హర్షుడి కాలంలో విశ్వవిఖ్యాతిగాంచిన విద్యాకేంద్రం నలంద