IPL 2023: క్వాలిఫై అవ్వాలంటే.. ఈ మ్యాచ్ గెలవాల్సిందే.!
ఐపీఎల్ చివరి అంకానికి చేరుతుంది. ఇప్పటికీ అధికారికంగా ఏ టీమ్ క్వాలిఫై కాలేదు. అదేవిధంగా ఏం టీం కూడా ఎలిమినేట్ కాలేదు. ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఓడిపోయిన టీంకు క్వాలిఫయింగ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
IPL 2023: ఐపీఎల్ చివరి అంకానికి చేరుతుంది. ఇప్పటికీ అధికారికంగా ఏ టీమ్ క్వాలిఫై కాలేదు. అదేవిధంగా ఏం టీం కూడా ఎలిమినేట్ కాలేదు. ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ని ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ రెండు టీంలకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఓడిపోయిన టీంకు క్వాలిఫయింగ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
రెండు టీంలు 11 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీం గెలిచినా ఇతర టీంల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా సెమీస్ చేరేందుకు అవకాశం ఏర్పడుతుంది.
రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ మిడిల్ ఓవర్లలో రాణించలేకపోతోంది. అంతేకాకుండా సిమ్రన్ హెట్మెయర్ ఫామ్‌లో లేకపోవడం రాజస్థాన్‌ను ఇబ్బంది పెడుతోంది. అతడు గత 6 మ్యాచుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. అతడు ఫామ్ అందుకోకపోతే మిడిలార్డర్లో రాయల్స్‌కు ఇబ్బంది తప్పదు. రాజస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కోల్‌కతా స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.
రాజస్థాన్ టీం అంచానా: యశస్వి, బట్లర్, శాంసన్, పడిక్కల్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, అశ్విన్, బౌల్ట్, జంపా, సందీప్ శర్మ చాహల్.
కోల్‌కతా నైట్‌రైడర్స్
కోల్‌కతా బ్యాటింగ్‌లో నీతీష్ రాణా స్పిన్ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడగల ఆడగాడు. కానీ గత రెండు సీజన్ల నుంచి చాహల్ బౌలింగ్‌లో ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు చాహల్ బౌలింగ్‌లో నితీష్ రాణా 5సార్లు ఔటయ్యాడు. మరోవైపు సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఆడేందుకు సంజూ శాంసన్ ఇబ్బంది పడుతున్నాడు. నరైన్ బౌలింగ్‌లో సంజూశాంసన్ స్ట్రైక్‌రేట్ 82.
కోల్‌కతా టీం అంచనా గుర్భాజ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, రస్సెల్, నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, హర్షిత్ రాణా, చక్రవర్తి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్….
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

